men get pregnant : పురుషులు గర్భం దాల్చేందుకు బ్యాంకు సాయం

men get pregnant : పురుషులు గర్భం దాల్చేందుకు బ్యాంకు సాయం
పురుషులకు పేరంటల్‌ లీవ్‌లు ఇస్తామని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ ప్రకటన... లింగ మార్పిడి శస్త్రచికిత్సలకు సాయం చేస్తామని వెల్లడి...

పురుషులు గర్భం దాల్చేందుకు బ్యాంకు సాయం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా కానీ మీరు వింటున్నది... మేం చెప్తున్నది అక్షరాజ నిజం. ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఒక సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. పురుషులూ గర్భం దాల్చేందుకు తాము సాయం చేస్తామని ప్రకటించడంతో పాటు అందుకు తగ్గ విధానాల రూపకల్పన కూడా చేసేసింది. 17వ శతాబ్దంలో నెలకొల్పిన ప్రసిద్ధమైన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ 103 పేజీల బ్లూ ప్రింట్‌లో స్త్రీలే కాకుండా పురుషులు గర్భం దాల్చవచ్చని.. అందుకే తమ విధానాల్లో మార్పులు తెస్తున్నట్లు ప్రకటించింది. బ్రిటన్‌లో లెస్బియన్‌, గే, బై సెక్సువల్‌, ట్రాన్స్‌ జెండర్‌ హక్కుల కోసం పోరాడే స్పచ్ఛంద సంస్ధ సోన్‌వాల్‌కు సమర్పించిన నివేదికలో బ్యాంక్‌ ఈ విషయాలను పేర్కొంది.


తమ కార్యాలయంలోని ఏడో అంతస్తును జెండర్‌తో సంబంధం లేకుండా ఎవరైనా ఉపయోగించగల బాత్‌రూమ్‌లకు కేటాయించినట్లు తెలిపింది. ఈ టాయిలెట్లు పురుషులతో సహా ఎవరూ గర్భం దాల్చినా వినియోగించుకోవడానికి సహాయపడేలా నిర్మించారు. ఈ సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. టాయిలెట్లను యునిసెక్స్ సౌకర్యాలుగా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని బ్యాంక్‌ తెలిపింది.తాము ఆర్థిక వ్యవస్థతోపాటు, సైన్స్‌లో వస్తున్న మార్పులను అర్ధం చేసుకుంటామని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వెల్లడించింది.

ఇప్పటివరకూ మహిళలకే ఉన్న కుటుంబ సెలవును పురుషులతో పాటు అందరికీ వర్తింపజేస్తామని బ్యాంక్‌ తెలిపింది. ఇందులో తల్లి అనే పదాన్ని.. తల్లిదండ్రులు అనే పదంగా మార్చారు. తమ పేరంటల్ లీవ్ పాలసీలో జెండర్‌తో సంబంధం ఉండదని, తల్లిదండ్రుల్లో ఎవరు గర్భం దాల్చినా ఈ విధానం వర్తిస్తుందని వెల్లడించింది. లింగమార్పిడి శస్త్ర చికిత్సకు కూడా సాయం చేసేందుకు తమ బ్యాంకు సిద్ధంగా ఉందని బ్యాంక్ ఆఫ్‌ ఇంగ్లండ్‌ గవర్నర్ ఆండ్రూ బెయిలీ ప్రకటించారు. బ్యాంక్‌లోని 4 వేల మంది ఉద్యోగులకు ఇన్సూరెన్స్‌ చేయించామని... ఈ బీమా లింగ మార్పిడికి కూడా వర్తిస్తుందని వివరించారు. కొత్తగా ఫ్యామిలీ లీవ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. జెండర్‌తో సంబంధం లేకుండా ఎవరూ గర్భం దాల్చినా మరో వ్యక్తికి సెలవులు మంజూరు చేస్తారు.


LGBT వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు పరిమాణాత్మక లక్ష్యాలను తీసుకొచ్చే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్ ప్రకటించింది. జెండర్‌ను పేర్కొనకుండా అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటినుంచి తాము తటస్థ పదజాలాన్ని ఉపయోగిస్తామని కూడా ప్రకటించింది. ఫ్యామిలీ లీవ్‌పై తమ విధానంలోని మార్పులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్నామని..ఇక జెండర్‌తో సంబంధం లేకుండా ఎవరికైనా పేరంటల్‌ లీవ్‌ పాలసీ వర్తిస్తుందని బ్యాంక్‌ ప్రతినిధి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story