టాలెంట్ గురూ.. ఒకటీ రెండు కాదు.. ఒకేసారి 28 కత్తెరలతో కటింగ్..
నీ పనే నీ గుర్తింపు తీసుకువస్తుంది అంటారు. కానీ ఆ గుర్తింపు కఠోర శ్రమ చేయాల్సి ఉంటుంది.. అప్పుడే అది అందరిలో నిన్ను ఒక్కడిగా నిలబెడుతుంది.
కష్టపడి శ్రమిస్తే ఫలితం ఉంటుంది. ఆ ఫలితానికి తగిన గుర్తింపు లభిస్తే ఆనందం ఉంటుంది. సాధారణంగా బార్బర్‌లు జుట్టు కత్తిరించడానికి 1 లేదా 2 కత్తెరలను ఉపయోగిస్తారు. ఉజ్జయిని నగరంలో చాలా మంది హెయిర్‌స్టైలిస్ట్ లు ఉన్నాఆదిత్య దేవరా పేరు మాత్రం ప్రత్యేకంగా వినిపిస్తుంది. బార్బర్ లు అందరూ ఒకటి రెండు కత్తెరలతో జుట్టు కత్తిరిస్తే ఆదిత్య మాత్రం ఒకేసారి 28 కత్తెరలను ఉపయోగించి అత్యంత చాకచక్యంగా హెయిర్ కట్ చేస్తాడు. ఇతడి టాలెంట్ కి తగిన గుర్తింపు లభించింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అతని పేరు నమోదైంది.
హెయిర్‌స్టైలిస్ట్ ఆదిత్య దేవరా ఉజ్జయినిలోని అలఖ్‌ధామ్ నగర్ నివాసి. అతను తన తండ్రి, సోదరుడితో కలిసి దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. నగరంలోని ఫ్రీగంజ్ మార్కెట్‌లో క్రియేషన్ వరల్డ్ ది యునిసెక్స్ సెలూన్ హెయిర్ కట్ పేరుతో ఒక దుకాణాన్ని నడుపుతున్నాడు. ఆదిత్య 18 ఏళ్ల నుంచి జుట్టు కత్తిరించడం చేస్తున్నాడు. 4 సంవత్సరాల క్రితం, ఆదిత్య 10 కత్తెరలతో కత్తిరించిన చైనా (BARBER) బార్బర్‌ని చూసి ఏదో ఒక రోజు తాను కూడా రికార్డ్ క్రియేట్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
మొదట 12 కత్తెరలతో ప్రారంభించి..
మొదట 12 కత్తెరలతో జుట్టు కత్తిరించడం ప్రారంభించి విజయాన్ని అందుకున్నాడు. గత సంవత్సరం ఇరాన్‌కు చెందిన బార్బర్ అలీ అబిదిని 22 కత్తెరలతో కత్తిరించడం చూశాడు. దాన్ని కూడా చాలెంజ్ గా స్వీకరించాడు. మరింత కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. అతడి కష్టానికి ఫలితం దక్కి 28 కత్తెరలతో జుట్టు కత్తిరిండం ప్రారంభించాడు. బార్బర్ అలీ అబిద్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు 28 కత్తెరలతో 70 మందికి పైగా కస్టమర్లను కట్ చేసి పనిలో తన ప్రావిణ్యాన్ని ప్రదర్శించాడు.
కృషి, అంకితభావం కారణంగా ఆదిత్య పేరు 4 ఏప్రిల్ 2022న ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేయబడింది. ఇప్పుడు 35 కత్తెరలతో కటింగ్ చేయడం నేర్చుకుని గిన్నిస్ బుక్, లింబా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకోవాలని ఆదిత్య భావిస్తున్నాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com