Madhya Pradesh: జంటను చంపి తిన్న ఎలుగుబంటి.. నాలుగు గంటల పాటు క్రూరంగా..

Madhya Pradesh: అడవిలో నివసించే ప్రతీ జంతువు.. మనుషులపై దాడి చేయదు. కొన్ని సాధు జంతువులు కూడా ఉంటాయి. కానీ ఎలుగుబంటిలో ఈ రెండిటిలో ఏ రకమో సరిగ్గా చెప్పలేము. ఒక్కొక్కసారి ఎలుగుబంటులు మనుషులకు ఎదురైనా ఏ హానీ చేయకుండా తప్పుకొని వెళ్లిపోతాయి. కానీ కొన్నిసార్లు మనుషులనే వాటి ఆహారంగా మార్చుకుంటాయి. ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ.
మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన ముఖేష్ రాయ్(43), తన భార్య గుడియా(39) తమ ఇంటి దగ్గరలో ఉన్న గుడికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారికి దారిలో ఓ ఎలుగుబంటి ఎదురయ్యింది. అక్కడే కదలకుండా ఉంటే ఆ ఎలుగుబంటి వారిని ఏమీ చేయదు అనుకున్నారు. కానీ ఆ ఎలుగుబంటి వారిపై దాడి చేసి.. ఆ ఇద్దరి శరీరాలను ఆహారంగా మార్చుకుంది.
ఆ శరీరాలను దగ్గరలో ఉన్న చెరువు దగ్గరకు లాక్కెళ్లి దాదాపు నాలుగు గంటల పాటు ఎలుగుబంటి తిన్నదని స్థానికులు చెప్తున్నారు. అక్కడ ఉన్నవారు అటవీ శాఖ అధికారులు సమాచారం అందించడంతో చాలాసేపు కష్టపడి వారు ఆ ఎలుగుబంటిని బంధించి, జూ కు తరలించారు. చనిపోయిన వారి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని స్థానికులు కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com