Bengaluru: వార్డెన్‌ కాదు.. నరరూపరాక్షసి..!

Bengaluru
Bengaluru: వార్డెన్‌ కాదు.. నరరూపరాక్షసి..!
బెంగళూరు బీసీ హాస్టల్‌లో వార్డ్‌న్‌ అరాచకం; బాలికల చేత టాయిలెట్‌ శుభ్రం చేయించిన వైనం; మంత్రికి లేఖ

బెంగళూరులోని బీసీ హాస్టల్‌లో ఓ సాడిస్ట్ వార్డెన్ వల్ల విద్యార్ధినులు నానా కష్టాలూ పడుతున్నారు. నగరంలోని రాజరాజేశ్వరి నగర్‌లో బీసీ హాస్టల్‌ లో విద్యార్థినుల చేత మరుగుదొడ్లను శుభ్రం చేయించి చిత్రహింసలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


వేధింపులకు గురైన విద్యార్థుల సహాయానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కోట శ్రీనివాస్ పూజారికి జయనగర్ ఎమ్మెల్యే పూజా రెడ్డి లేఖ రాశారు. ఇందులో అమ్మాయిలు ఎదుర్కొన్న అకృత్యాలు కూలంకషంగా ప్రస్తావించారు. విద్యార్ధినులకు సమయానికి తిండిపెట్టకుండా, రకరకాల పనులు చేయించుకుంటుందని, చివరికి సెలవులకు తమ ఇళ్లకు వెళ్లాడానికి కూడా పర్మిషన్‌ ఇవ్వకుండా తన వ్యక్తిగత ఉపయోగాలకు ఇంటి నుంచి మిక్సర్లు వంటి ఖరీదైన బహుమతులను తిరిగి తీసుకురావాలని వారిపై ఒత్తిడి తెస్తోందని లేఖలో పేర్కొన్నారు.

ఇష్టానుసారంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తోందని, దాని గురించి ప్రశ్నించిన ఓ విద్యార్ధులపై దుర్భాషలాడుతోందని తెలిపింది. ఆమె వ్యక్తిగత పనులు సైతం చేయించుకుంటుందని ఓ విద్యార్ధి వెల్లడించినట్లు లేఖలో ప్రస్తావించారు. విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు పలుమార్లు అధికారులకు తెలియజేసినా వారి నుంచి ఎటువంటి సహాయం అందలేదు సరికదా వార్డెన్ అరాచకం హెచ్చుమీరిందని రాసుకొచ్చారు.

ఇప్పటికైన తాము ఎదుర్కొంటున్న సమస్యలపై తగిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్ధులు వేడుకుంటున్నారు. వార్డెన్‌ అరాచకాల నుంచి తమని బయటపాడేయాలని విద్యార్థినులు వేడుకుంటున్నారని ఎమ్మెల్యే లేఖలో పేర్కొన్నారు. మరోవైపు వార్డెన్‌ అకృత్యాలుపై మహిళా సంఘాలు సీరియస్ అయ్యాయి. హాస్టల్ వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

Tags

Next Story