Bengaluru: ఫ్లై ఓవర్ పై నుంచి నోట్ల వర్షం...

బెంగుళూరులో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫ్లైఓవర్ పై నుంచి కరెన్సీ నోట్లను కుమ్మరించాడు. సూటూబూటూ వేసుకుని బైక్ మీద వచ్చిన ఆ వ్యక్తి ఫ్లై ఓవర్ కింద ఉన్న మనుషుల పైకి నోట్లను జల్లాడు.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని కేఆర్ మెరేట్ ఫ్లైఓవర్‌పైన ఓ వ్యక్తి బైక్ పై బ్యాగ్ నిండా రూ.10 నోట్ల కట్టలను తీసుకువచ్చాడు. బైక్ ను రోడ్డు పక్కగా పార్క్ చేసి బ్యాగ్ లో నుంచి నోట్లను తీసి పైనుంచి కిందకు విసిరేశాడు. దీంతో కింద నుంచి వెళ్లే వాహనదారులు వాటిని ఏరుకునేందుకు వాహనాలను నిలిపి వాటికోసం పరిగెత్తారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.
పైనుంచి కిందకు నోట్లు విడుస్తుండగా గాలికి కొన్ని నోట్లు ఫ్లైఓవర్‌పై కూడా పడ్డాయి. అటువైపుగా వెళుతున్నవారు కూడా వాటి కోసం పరుగులు పెట్టడంతో ఫ్లైఓవర్‌పై కూడా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. తరువాత సదరు వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక సదరు వ్యక్తి జీవితం పై విసుగుచెంది ఈ పనికి పూనుకున్నట్లు వెల్లడించడం కొసమెరుపు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com