Udita Pal: పెళ్లిచూపులకు వచ్చిన వ్యక్తి నచ్చడంతో ఉద్యోగం ఇచ్చిన యువతి..

Udita Pal: ఈమధ్యకాలంలో పెళ్లంటే అమ్మాయిలు వరుడి కోసం, అబ్బాయిలు వధువు కోసం మాట్రిమోని సైట్స్‌నే ఆశ్రయిస్తున్నారు. అయితే అలా మాట్రిమోనిలో చూసిన సంబంధాలను డైరెక్ట్‌గా కలిసి నచ్చితే నచ్చారని.. లేకపోతే లేదని చెప్తూ ఉంటారు. కానీ ఆ యువతికి అబ్బాయి నచ్చాడు. కానీ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. అందుకే ఉద్యోగం ఆఫర్ చేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
బెంగుళూరుకు చెందిన ఉదితా పాల్ అనే యువతి సొంతంగా ఓ స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేసింది. ఇప్పుడిప్పుడే తన స్టార్టప్‌కు మంచి గుర్తింపు వస్తోంది. అయితే ఇదే సమయంలో ఉదితాకు తన తండ్రి ఒక సంబంధాన్ని తీసుకొచ్చాడు. ఉదితా మాట్రిమోనిలో ఆ అబ్బాయి ప్రొఫైల్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యింది. కానీ ఆ తర్వాత ఉదితా చేసిన పనికి తన తండ్రి షాక్ అయ్యారు.
ఉదితా పాల్‌కు ఆ అబ్బాయి ప్రొఫైల్ చాలా నచ్చింది. తన వర్క్ ఎక్స్‌పీరియన్స్ చూసి ఇంప్రెస్ అయిన ఉదితా.. అతడికి తన స్టార్టప్‌లో జాబ్ ఆఫర్ చేసింది. అయితే దీని గురించి తనకు, తన తండ్రికి మధ్య జరిగిన ఛాటింగ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఉదితా.. ఈ పోస్ట్ కాసేపట్లోనే తెగ వైరల్ అయిపోయింది.
'నువ్వేం చేశావో నీకు అర్థమవుతుందా? నువ్వు మాట్రిమోని సైట్‌లో చూసి ఉద్యోగంలో చేర్చుకోలేవు. ఇప్పుడు అతడి తండ్రికి నేనేం సమాధానం చెప్పాలి. నేను నీ మెసేజ్ చూశాను. అతడికి ఇంటర్వ్యూ లింక్ పంపి.. రెజ్యూమ్ అడిగావు' అని ఉదితా తండ్రి మెసేజ్‌లు చేయగా.. దానికి ఉదితా.. 'ఫిన్‌టెక్‌లో ఏడేళ్లు ఎక్స్‌పీరియన్స్ ఉండడం గ్రేట్. మేము అతడిని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాం' అని రిప్లై ఇచ్చి సారీ చెప్పింది.
What getting disowned from father looks like. pic.twitter.com/nZLOslDUjq
— Udita Pal 🧂 (@i_Udita) April 29, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com