ఆ ఇల్లే... పాముల పుట్ట
పామును చూస్తే ఎవరికైనా భయమే. దూరాన పాము కనిపిస్తేనే వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడతాం. అలాంటిది ఒక్కసారిగా కుప్పలు తెప్పలుగా పాములు కనిపిస్తే.. అందులో కింగ్ కోబ్రా పాములైతే... ఇంకేమైనా ఉందా... పై ప్రాణాలు పైనే పోవు. బిహార్‌లోని ఒక ఇంట్లో కుప్పలుగా పాములు దర్శమిచ్చాయి. ఒకటి కాదు.. రెండు కాదు ఏ గోడ తవ్వినా పాములే... ఏ మూల చూసినా పాములే...
బిహార్‌లోని రోహ్తాస్ పట్టణంలో ఒకే ఇంట్లో 60 పాములు కనిపించడం కలకలం రేపింది. అగ్‌రోఢ్ ఖుర్ద్ గ్రామంలోని ఇంట్లో ఈ పాములు కనిపించాయి. వరుసగా ఒక్కో పాము ఇంట్లో నుంచి బయటకు వచ్చాయని ఇంటి యజమాని కృపానారాయణ్ పాండే చెప్పాడు. వచ్చిన పాములను వచ్చినట్టే 24 పాముల వరకూ చంపానని అయినా పాములు వస్తూనే ఉండడంతో అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు చాలా పాములను పట్టుకున్నారు. ఇంటి గోడలు, ఫ్లోరింగు పగులగొట్టి సుమారు 30 పాములను బయటకు తీశారు. ఇవన్నీ ఇండియన్ కోబ్రా జాతికి చెందినవని పాములుగా గుర్తించారు. రెండంతస్తుల తమ ఇంటిని 1955లో నిర్మించినట్లు కృపానారాయణ్ తెలిపారు. ఇప్పుడు అక్కడ అన్ని పాములు భయపడేసరికి ఆయన భయపడిపోయారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com