కాటేసిన పామును కసిదీరా కొరికాడు..!

కాటేసిన పామును కసిదీరా కొరికాడు..!
కాటేసిన పామును కసిదీరా కొరికాడు ఓ వ్యక్తి.. ఈ విచిత్ర సంఘటన బిహర్ లోని నలంద జిల్లాలో జరిగింది.

కాటేసిన పామును కసిదీరా కొరికాడు ఓ వ్యక్తి.. ఈ విచిత్ర సంఘటన బిహర్ లోని నలంద జిల్లాలో జరిగింది. ఇక వివారల్లోకి వెళ్తే.. మాధోపూర్ గ్రామానికి చెందిన రామా మహాతోని అనే 65 ఏళ్ల వ్యక్తిని ఓ పాము కాటేసింది. దీంతో ఆ పామును వెంటాడి మరిపట్టుకొని కొరికి చంపేశాడు. అనంతరం ఇంటిపక్కనే ఉన్న చెట్టుపైన దానిని వేలాడదీశాడు. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్ళమని గ్రామస్తులు చెప్పినప్పటికీ వినకుండా.. 'పాముని చంపేశాను కదా.. నాకేం కాదులే' అంటూ పెడచెవిన పెట్టి రాత్రి భోజనం చేసి పడుకున్నాడు. ఇక ఉదయాన్నే స్పృహా తప్పి పడిపోయిన అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అతను అప్పటికే మరణించినట్టుగా వైద్యులు వెల్లడించారు. నిన్న(ఆదివారం) జరిగిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags

Next Story