Viral Video: పాములకు రాఖీ కట్టించబోయి.. అంతలోనే..!

Bihar: రక్షాబంధన్ రోజునే ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుంది. మృత్యువు పాము రూపంలో వచ్చి బలితీసుకుంటుందని తెలుసుకోలేకపోయాడు. పదేళ్లుగా పాముల సంరక్షించే మన్మోహన్ చివరికి పాము కాటుతోనే మరణించడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన బీహార్‌లోని సరన్‌లో చోటుచేసుకుంది. చెల్లితో పాములకు రాఖీకట్టించాలన్నా ప్రయత్నంలో ప్రాణాలు కొల్పోయాడు.
ఈ నెల 22వ తేదీ(ఆదివారం) రాఖీ పండగ సందర్భంగా.. పాములు పట్టే 25 ఏళ్ల మన్మోహన్ తన సోదరితో జంట పాములకు రాఖీ కట్టించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతను 2 పాముల తోకలను పట్టుకున్నాడు. ఇంతలో ఒక పాము మన్మోహన్ కాలి బొటన వేలుపై కాటు వేసింది. ఊహించని హఠాత్పరిణామంతో షాక్ తిన్న మన్మోహన్.. హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లాడు.
అయితే అప్పటికే పాము విషం మన్మోహన్ శరీరం మొత్తం వ్యాపించడంతో ప్రాణాలు కోల్పోయాడు. మన్మోహన్ పాములకు రాఖీ కట్టించే వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియలో మన్మోహన్ రెండు పాములను పట్టుకున్నాడు. వాటితో సోదరికి రాఖీ కట్టించాలని ప్రయత్నం చేశాడు. ఈ వీడియో స్థానికులు సెల్ ఫోన్ లో చిత్రీకరించడంతో వైరల్‌గా మారింది.
बिहार के सारण में बहन से साप को राखी बंधवाना महंगा पड़ गया साप के डसने से भाई की चली गई जान pic.twitter.com/675xsgnZ6N
— Tushar Srivastava (@TusharSrilive) August 23, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com