Bihar : తన కొడుకు బెయిల్ కోసం వెళ్తే.. ఆ తల్లితో మసాజ్ చేయించుకున్న పోలీస్...!

Bihar :  తన కొడుకు బెయిల్ కోసం వెళ్తే.. ఆ తల్లితో మసాజ్ చేయించుకున్న పోలీస్...!
Bihar : కొడుకు బెయిల్ కోసం వెళ్తే ఓ తల్లి పొలీస్ స్టేషన్‌కి వెళ్తే.. అక్కడి సీనియర్ అధికారి ఆమెతో మసాజ్ చేయించుకున్నాడు.

Bihar :కొడుకు బెయిల్ కోసం వెళ్తే ఓ తల్లి పొలీస్ స్టేషన్‌కి వెళ్తే.. అక్కడి సీనియర్ అధికారి ఆమెతో మసాజ్ చేయించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బీహార్‌లోని సహర్సా జిల్లాలోని నౌహట్ట పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా అరెస్ట్ అయిన తన కొడుకు కోసమని పొలీస్ స్టేషన్‌‌కి వెళ్ళింది ఆ మహిళా... బెయిల్ గురించి అక్కడి సీనియర్ అధికారి శశిభూషణ్ సిన్హాను అడిగింది. అయితే శశిభూషణ్ ఆమె కొడుకుకి బెయిల్ ఇప్పిస్తానని, అయితే అందుకు గాను తనకు మసాజ్ చేయాలని అడిగాడు.

అతని మాటలు నమ్మిన ఆమె.. శశిభూషణ్ సిన్హా‌కు మసాజ్ చేసింది. ఆ సమయంలో శశిభూషణ్ ఒంటి పైన చొక్కా కూడా లేదు. అతనికి ఎదురుగా కూర్చీలో మరో మహిళ కూడా ఉంది.. అయితే ఆ పేద మహిళా మసాజ్ చేస్తున్న సమయంలో శశిభూషణ్ ఓ లాయర్ కి ఫోన్ చేసి మాట్లాడాడు.. ఆమె పేద మహిళ అని రూ.10 వేలు ఇస్తా.. వెంటనే ఆమె కొడుక్కి బెయిల్‌ ఇవ్వాలని లాయర్‌ను కోరాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో శశిభూషణ్ సిన్హాను తక్షణమే సస్పెండ్ చేశారు అధికారులు. ఈ ఘటనపై విచారణకు కూడా ఆదేశించారు.



Tags

Next Story