Kerala: సినిమా సీన్‌ను తలపించేలా బైక్ యాక్సిడెంట్.. వీడియో వైరల్..

X
By - Divya Reddy |5 Jun 2022 5:45 PM IST
Kerala: కేరళలో ఓ యువకుడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. సినిమా సీన్‌ను తలపించేలా బైక్ యాక్సిడెంట్ జరిగింది.
Kerala: కేరళలో ఓ యువకుడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. సినిమా సీన్‌ను తలపించేలా బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఇడుక్కి జిల్లా కట్టప్పన సమీపంలోని వెల్లయంకుడిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అతి వేగంతో దూసుకొచ్చిన ఓ బైక్ గాల్లోకి ఎగిరి దారి పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ కంచె లోపల పడిపోయింది. ఆ బైక్‌పై ఉన్న యువకుడు కూడా గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు. స్వల్ప గాయాలు అయ్యాయి. అటు.. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు పవర్ సరఫరా నిలిపివేసి.. కంచెలో ఇరుక్కుపోయిన బైక్‌ను బయటికి తీశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com