BJP : అతడి నేతృత్వంలో అమ్మాయిలకు రక్షణలేదు: నటి

BJP : అతడి నేతృత్వంలో అమ్మాయిలకు రక్షణలేదు: నటి
అన్నమలై పై మండిపడుతున్న గాయత్రి; బీజేపీ పార్టీని దుయ్యబట్టిన గాయత్రి రఘురాం; స్వంత పార్టీ నుంచి తప్పుకున్న గాయత్రి; అన్నామలై నాయకత్వంలో మహిళలకు భద్రత లేదు- గాయత్రి

నటి, తమిళనాడు బీజేపీ నేత గాయత్రి రఘురాం పార్టీకి గుడ్‌బై చెప్పారు. జరుగుతున్న రాజకీయ పోకడలను ఆమె దుయ్యపట్టారు. ఆమె పార్టీని వీడడానికి ముఖ్యకారణం పార్టీలో మహిళల పట్ల గౌరవం లేకపోవడమేనని చెప్పారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన అన్నామలై మరో కారణం అని ఆమె పేర్కొంది. అసలు అన్నామలై నాయకత్వంలో మహిళలు సురక్షితంగా లేరని పేర్కొన్నారు.

సొంత పార్టీలోనే తాను అవమానాలకు గురైనట్లు గాయత్రి తెలిపారు. తన రాజీనామాకు ప్రధాన కారణం అన్నామలై అని తెలిపారు. అన్నామలై ఒక అబద్ధాలకోరని, అధర్మ నాయకుడని ఆరోపించారు. అతడి నాయకత్వంలో మహిళలకు రక్షణలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్నామలై పై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అతడిని విచారించాల్సిన అవసరం ఉందని గాయత్రి డిమాండ్ చేశారు.

ఇక పార్టీలోని మహిళలను ఉద్దేశించి ఎవరైనా తమను రక్షిస్తానని చెబితే నమ్మవద్దని, గౌరవం లేని చోట ఉండకూడదని చెప్పుకొచ్చారు. మహిళలకు సమాన హక్కులు, గౌరవం ఇవ్వనందునే భాజాపాకు రాజీనామా చేశానని తెలిపారు. ఓ నాయకుడి ఆడియో లీక్ ఘటనతో ఆమెను పార్టీ సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

Tags

Next Story