Sonu Sood : గ్రేట్ నాగలక్ష్మి.. నువ్వు దేశంలోనే శ్రీమంతురాలివి..!

Sonu Sood : గ్రేట్ నాగలక్ష్మి.. నువ్వు దేశంలోనే శ్రీమంతురాలివి..!
కళ్లు లేకపోతేనేం ఓ మహిళ పెద్ద మనసు చాటుకున్నారు. ఏపీలోని వరికుంటపాడుకు చెందిన బొడ్డు నాగలక్ష్మి సోనూసూద్ ఫౌండేషన్‌కు రూ. 15వేల విరాళం అందించారు.

కళ్లు లేకపోతేనేం ఓ మహిళ పెద్ద మనసు చాటుకున్నారు. ఏపీలోని వరికుంటపాడుకు చెందిన బొడ్డు నాగలక్ష్మి సోనూసూద్ ఫౌండేషన్‌కు రూ. 15వేల విరాళం అందించారు. 5 నెలల పింఛన్ సొమ్మును జమ చేసుకుని ఈ సాయం చేశారు. నాగలక్ష్మి యూట్యూబ్ లో వీడియోలు కూడా చేస్తుంటారు. నాగలక్ష్మి మంచి మనసుకు సోనూ ఫిదా అయ్యారు. ఇండియాలో అత్యంత ధనవంతురాలు నాగలక్ష్మి అని.. ఇతరుల బాధను అర్థం చేసుకునేందుకు కంటి చూపు ఉండాల్సిన అవసరం లేదని మంచి మనసుంటే చాలు అని అన్నారు. అటు సోనూసూద్‌ను కలిసే అవకాశం వస్తే తాను దాచుకున్న డబ్బులు కూడా ఇచ్చేస్తానని నాగలక్ష్మి చెప్పుకొచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story