Bollywood: సీక్రెట్ గా పనికానిచ్చేసిన ఐటమ్ గర్ల్...

Bollywood:  సీక్రెట్ గా పనికానిచ్చేసిన ఐటమ్ గర్ల్...
అదిల్‌ ఖాన్ ను రహస్యంగా వివాహం చేసుకున్న రాఖీ సావంత్; గతేడాదే రహస్యంగా వివాహం చేసుకున్న రాఖీసావంత్‌

బాలీవుడ్‌ లో పాపులర్‌ ఐటమ్‌ గాల్‌ అయిన రాఖీసావంత్‌ మరోసారి వార్తలోకి ఎక్కింది. తన భర్త నుంచి విడిపోయిన కొన్ని నెలలకే మరో ప్రియుడు అదిల్‌ ఖాన్‌ తో ప్రమాయణం నడిపిన ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్‌ వార్త బయటకొచ్చింది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేసుకుని అందరిని షాక్‌ కు గురిచేశారు. ప్రస్తుతం వీరిరువురికి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో హట్‌ టాపిక్‌ గా మారాయి.

వారి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు నెట్టింట లీక్‌ అవ్వడంతో ఈ ముచ్చట ప్రస్తుతం హట్‌ టాపిక్‌ గా మారింది. ఫొటోలను బట్టీ రాఖీ- అదిల్‌ రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. పెళ్లిదుస్తుల్లో తళుక్కుమన్న ఇరువురూ మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇంత పక్కాగా పెళ్లి చేసుకున్న వీరు ఆ ముచ్చటను ఎవరికీ తెలీకుండా ఎందుకు దాచిపెట్టారన్నదే అర్థంకానీ ప్రశ్నగా మిగిలింది. ఏమైనా రాఖీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.



Tags

Next Story