Bori Wala Palazzo: కొత్త ఫ్యాషన్.. గోనె సంచితో పలాజో..

X
By - Prasanna |20 Feb 2023 4:39 PM IST
Bori Wala Palazzo: ఫ్యాషన్ అంటే కొత్తగా ఏదో ట్రై చేయడం.. అప్పుడే కదా అది ట్రెండ్ సెట్టర్‌ని క్రియేట్ చేస్తుంది.
Bori Wala Plaza: ఫ్యాషన్ అంటే కొత్తగా ఏదో ట్రై చేయడం.. అప్పుడే కదా అది ట్రెండ్ సెట్టర్‌ని క్రియేట్ చేస్తుంది. తాజాగా ఫ్యాషన్ డిజైనర్లు మన ఇళ్లలో తృణధాన్యాలు, ఇతర వస్తువులను నిల్వ చేయడానికి తరచుగా ఉపయోగించే జ్యూట్ బ్యాగ్‌లను ఉపయోగించి పలాజో తయారు చేసారు.
"సచ్కద్వాహై" అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షోరూమ్ వీడియోను షేర్ చేసింది, అక్కడ బస్తాల తయారీకి ఉపయోగించే జూట్ ఫాబ్రిక్‌తో చేసిన పలాజో ప్రదర్శించబడింది. ఇక దీని ధర చూస్తే రూ.60,000 ఉంది. ఏంటి ఈ గోనె సంచితో చేసిన పలాజోకి రూ.60వేలు చెల్లిస్తారా అని క్యాప్షన్ జత చేశారు. దాంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. ఇప్పటికే దీనిని 5 లక్షల మంది చూడగా వేల మంది లైకులు, షేర్లు కొడుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com