Ap News: 'సారీ మోసం చేయలేదు'.. ఓ ప్రేమికుడి వినూత్న క్షమాపణ!

Ap News (tv5news.in)

Ap News (tv5news.in)

Ap News: 'సారీ'.. ఈ మాట వినడానికి మామూలుగా ఉన్నా.. చెప్పడానికి మాత్రం చాలా బరువుగా ఉంటుంది.

Ap News: 'సారీ'.. ఈ మాట వినడానికి మామూలుగా ఉన్నా.. చెప్పడానికి మాత్రం చాలా బరువుగా ఉంటుంది. అందుకే ఎలాంటి గొడవ అయినా సారీ చెప్తే ఆగిపోతుందని తెలిసినా.. చెప్పడానికి చాలావరకు ఇష్టపడరు. ఒక్కొక్కసారి సారి చెప్పినా ఆగని గొడవలు ఉంటాయి. ముఖ్యంగా రిలేషన్‌షిప్‌లో 'సారి' అనే పదం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్నో రిలేషన్‌షిప్స్ ఈ ఒక్క పదాన్ని చెప్పలేక విడిపోయాయి కూడా. కానీ ఒక అబ్బాయి తన సారీని అమ్మాయికి మాత్రమే కాదు ఊరంతా తెలిసేలా చెప్పాడు.

ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సారి చెప్తారు. కొందరు గిఫ్ట్‌లు ఇస్తారు. కొందరు చాక్లెట్‌లు ఇస్తారు. మరికొందరు సర్ప్రైజ్ చేసి కోపాన్ని పోగొడతారు. ఇవన్నీ చేసినా కూడా తన గర్ల్‌ఫ్రెండ్ కూల్ అవ్వలేదేమో.. అందుకే రాజమహేంద్రవరంలో ఓ కుర్రాడు చాలా వినూత్నంగా ఆలోచించాడు.

'సారీ మోసం చేయలేదు' అంటూ రాజమహేంద్రవరం నగరంలోని ఏపీ అప్పారావు రోడ్డు, అద్దేపల్లి కాలనీ, షీలానగర్‌‌ లాంటి ప్రాంతాల్లో పలు చోట్ల పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఈ పని ఎవరు చేశారో తెలీదు. కానీ ఒక అబ్బాయి.. తాను ప్రేమించిన అమ్మాయికి సారీ చెప్తూ ఈ పోస్టర్లు అంటించాడని ఆ ఏరియాల్లో గుసగుసలు వినిపించినా.. ఎక్కడా దీని గురించి సరైన ఆధారం లేదు. మరి ఇంత చేసినందుకు ఆ అమ్మాయి కోపం ఇప్పటికైనా తగ్గిందో లేదో..

Tags

Next Story