Brazil Fisherman Chased: వణుకు పుట్టించిన వింతజీవి.. మత్స్యకారుడి వెంటపడి..

Brazil Fisherman Chased: వణుకు పుట్టించిన వింతజీవి.. మత్స్యకారుడి వెంటపడి..
X
Brazil Fisherman Chased: బ్రెజిల్‌‌కి చెందిన ఓ మత్స్యకారుడు ఎప్పటిలాగానే సముద్రంలోకి వెళ్లాడు.

Brazil Fisherman Chased: ప్రపంచంలో మానవాళికి తెలియని ప్రాణులు కూడా ఉంటాయి. అందులో మనకు తెలిసిన ప్రాణులు కొన్నే. ఒక్కొక్కసారి మనం ఇప్పటివరకు ఎప్పుడూ చూడని, వినని జీవులు కూడా కంటపడుతుంటాయి. అందులో కొన్ని చూడడానికి అందంగా సాదుజీవుల్లా ఉన్నా.. మరికొన్ని మాత్రం భయపెట్టేలా ఉంటాయి. అందులో ఒకటి బ్రెజిల్‌లోని ఓ మత్స్యకారుడి వెంటపడింది. వైరల్ అయిన ఆ వీడియో చూస్తుంటే.. చూసేవారికే వణుకు పుట్టించేలా ఉంది.

బ్రెజిల్‌‌కి చెందిన ఓ మత్స్యకారుడు ఎప్పటిలాగానే సముద్రంలోకి వెళ్లాడు. కానీ ఆరోజు తనకు కనపడిన దృశ్యాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు. అందుకే దానిని వీడియోలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూసిన వారంతా ఒక్క క్షణం ఆగిపోయి.. అసలు ఏం జరిగిందని ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ వీడియోలో ఉన్నది ఏమిటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.

ఆ వీడియోలో సముద్ర రాక్షసి లాంటి ఆకారం ఒకటి మత్స్యకారుడి బోటు వెంటపడింది. దానికి భయపడి అతడు బోటును ఎంత వేగంగా పోనిస్తున్నాడో.. అంతే వేగంతో అది ఆ బోటును వెంబడించింది. బోటు లైట్లకు ఆ జీవి కళ్లు మెరుస్తూ కనిపించాయి. దాదాపు బోటు దగ్గరకు చేరుకున్న తరువాత ఆ జీవి మాయమయిపోయింది. చీకటిలో, సముద్రం మధ్యలో ఆ జీవి ఏంటనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు.


Tags

Next Story