స్కూల్ టీచర్ క్లాసులో.. విద్యార్ధులతో అసభ్యంగా..

స్కూల్ టీచర్ క్లాసులో.. విద్యార్ధులతో అసభ్యంగా..
విద్యార్థులకు చదువు చెప్పాల్సిన టీచర్లు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.

విద్యార్థులకు చదువు చెప్పాల్సిన టీచర్లు శృతి తప్పి ప్రవర్తిస్తున్నారు. విద్యార్ధులతో అసభ్యకరంగా డాన్సు చేస్తూ అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్లు వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వింత పోకడ విద్యార్ధుల తల్లిదండ్రులకు తిక్కరేగించింది. తల్లిదండ్రుల కంప్లైంట్ తో స్కూల్ యాజమాన్యం ఆ టీచర్ ని ఉద్యోగం నుంచి ఊడబీకింది.

బోరింగ్ స్టడీని స్టూడెంట్స్ కి కొంచెం ఇంట్రెస్టింగ్ గా మార్చాలనుకుంది ఓ టీచర్. ఆ పేరుతో తరగతి గదిలోని విద్యార్థులతో ఆమె చేసిన పని 'అత్యంత అభ్యంతరకరం' అని పాఠశాల అధికారులు టీచర్‌కు చెప్పడంతో వెంటనే ఆమెను తొలగించారు. ఇకపై ఆమె పాఠశాలలో బోధించాల్సిన అవసరం లేదు అని ఖరాఖండిగా చెప్పేసింది.

ఈ ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. ఓ స్కూల్‌లో సిబెలీ ఫెరారియా అనే టీచర్ ఇంగ్లీషు బోధిస్తుంది. అయితే సిబెలీ స్కూల్ లో టీచర్‌గా పని చేస్తూనే టిక్ టాక్ వీడియోలు కూడా చేసేది.

ఆ వీడియోను టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 12 లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఇది కాకుండా, ఆమె అడల్ట్ కన్స్యూమర్ ఓరియెంటెడ్ మోడల్‌గా కూడా పనిచేస్తుంది. ఆ వీడియోల్లో విద్యార్థినులతో కలిసి సిబెలీ డ్యాన్స్‌ని, ఆమె బట్టలు విప్పుతున్న దృశ్యాన్ని చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. దీనిపై వారు స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో ఆమెపై చర్యలు తీసుకున్నారు. తరగతి గదిలో విద్యార్థులతో టీచర్ డ్యాన్స్ చేస్తున్న తీరును సోషల్ మీడియా తీవ్రంగా వ్యతిరేకించింది.

మొదట్లో నెలకు ఒకటి రెండు ఇలాంటి వీడియోలు చేసేది. క్రమంగా ఆ సంఖ్య పెరిగింది. అయితే, సిబెల్లీ బ్రెజిల్ వార్తా సంస్థతో మాట్లాడుతూ, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య ఉన్న సంబంధం ఒక స్నేహితుడు లాంటిదని. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని స్కూల్ యాజమాన్యంతో వాదించింది. ఆమె వారితో రికార్డ్ చేసిన వీడియోలు అదనపు ఆదాయం కోసం మాత్రమే అని తెలిపింది. నా కుటుంబానికి, మా అమ్మకు ఈ విషయం తెలుసు వాళ్లు ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు అని పేర్కొంది.

ప్రతి స్త్రీకి తనపై తనకు నమ్మకం ఉండాలని తెలిపింది. స్కూల్ టీచర్ బయాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అయితే ఆమె స్కూల్‌లో ఇంగ్లీష్ బోధించేదని బ్రెజిల్ మీడియా పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story