పెళ్లి కూతురా.. మజాకా.. ! బరాత్‌లో కుర్రాళ్లకే షాక్..!

పెళ్లి బరాత్ అంటే.. ఫ్రెండ్స్ హడావుడే ఎక్కువగా ఉంటుంది. కాని, కుర్రాళ్లకే షాక్ ఇస్తూ డ్యాన్స్‌తో కుమ్మేసింది పెళ్లికూతురు. బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తవా అంటూ పెళ్లికొడుకునే కాస్త టీజ్ చేస్తున్నట్టుగా డ్యాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆడపిల్లను అత్తవారింటికి పంపించేప్పుడు.. సాధారణంగా పెళ్లికూతురు, తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటారు. కాని, ఇక్కడి ఊరేగింపు అందుకు డిఫరెంటుగా సాగింది. కన్నీళ్లులేవ్, కనిపెంచిన వారిని పట్టుకుని ఏడవడాళ్లేవ్. ఓన్లీ డ్యాన్స్ మాత్రమే. డీజే సౌండ్‌కు తగ్గట్టుగా స్టెప్పులేస్తూ.. అక్కడున్న వాళ్లందరినీ సర్‌ప్రైజ్ చేసింది పెళ్లికూతురు సాయి శ్రీయ.
మంచిర్యాలలో జరిగిన ఈ పెళ్లి తంతు అందర్నీ ఆకట్టుకుంది. పెళ్లికొడుకు అశోక్ కూడా ఒకట్రెండు స్టెప్పులేశాడు. నవ్వుతూనే, తన భార్యను ఎంకరేజ్ చేశాడు. నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా అని అడగ్గానే.. సై అన్నట్లు తలూపాడు. ఏమైనా.. పెళ్లికూతురు కారు దిగి ఇలా డ్యాన్స్ చేయడం చాలా అరుదుగా కనిపించే సీన్ అంటూ తెగ ఎంజాయ్ చేశారు పెళ్లికొచ్చిన వాళ్లు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com