Bride on Bike: ట్రెండ్ మారింది.. పెళ్లికూతురు బుల్లెట్ బండి నడుపుతూ..

Bride on Bike: పందిట్లో పుత్తడి బొమ్మలా అలంకరించుకుని సిగ్గుతో తలవొంచుకునే పెళ్లి కూతురు గురించి మాట్లాడుకునే రోజులు మరిచి పోవల్సిందే.. కాలం మారింది.. అమ్మాయిల ఆలోచనా విధానం కూడా మారింది.. పల్లకిలో రావడం పాత స్టైల్.. ట్రెండ్ సెట్ చేయాలంటే సమ్‌థింగ్ డిఫరెంట్‌గా చెయ్యాలి.. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో అమ్మాయి ఎంచక్కా బుల్లెట్ బండి నడుపుకుంటూ కళ్యాణమండపానికి వెళుతోంది.. ప్రేమించిన ప్రియుడి చేత మూడు ముళ్లు వేయించుకోవడానికి.
వీడియోలో, వధువు ఎరుపు రంగు లెహంగా ధరించి రోడ్డుపై బుల్లెట్ నడుపుతూ కనిపించింది. నెటిజన్స్ ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. కొన్ని జాగ్రత్తలు కూడా సూచిస్తున్నారు.. డ్రైవింగ్ బావుంది కానీ హెల్మెట్ ఏదీ.. హెల్మెట్ లేకుండా హెవీ డ్రెస్సులు వేసుకుని బైక్ నడిపితే ప్రమాదం కదా అని అంటున్నారు. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో witty_wedding అనే ఖాతా ద్వారా షేర్ చేసారు,
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com