Madhya Pradesh : తాళికట్టే టైమ్ కి కరెంట్ కట్... చెల్లెలకు కాబోయే భర్తతో అక్కకు పెళ్లి..!

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఓ ఇద్దరు అక్కాచెల్లెళ్లకు పెళ్లి ఫిక్స్ అయింది.. సరిగ్గా తాళి కట్టేసమయంలో కరెంట్ పోవడంతో చెల్లెలికి కాబోయే భర్త ఆమె అక్క మేడలో వరమాల వేయగా, అక్కను పెండ్లి చేసుకోవాల్సిన వరుడు ఆమె చెల్లెలి మెడలో వరమాల వేశాడు. రమేశ్‌లాల్ కి నికిత, కరిష్మా అనే ఇద్దరు కుమార్తెలున్నారు.. వీరికి వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు యువకులు దంగ్వారా భోలా, గణేష్‌లతో ఒకేసారి వివాహం జరిపించాలని ఫిక్స్ అయ్యారు.
ఆదివారం రోజున పెళ్లి జరుగుతున్న సమయంలో కరెంట్ పోయింది. ఈ క్రమంలో అక్కాచెల్లెళ్లు ఒకే రకమైన పెండ్లి దుస్తుల్లో ఉండటంతో భోలా, గణేష్ లు తారుమారుగా మనువాడారు. జంటల విషయం తారుమారైన సంగతి తమ ఇంటికి వధువులను తీసుకువెళ్ళేవరకు తెలియదు. ఈ క్రమంలో మరుసటి రోజున పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరించి రుసటి రోజు మళ్లీ పెండ్లి తంతు నిర్వహించాలని నిర్ణయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com