Video Viral: ఇష్టమైన వ్యక్తితో జీవితం.. పెళ్లి మండపంలో వధువు ఆనందం..
Video Viral: అప్పటి వరకు ఆడపిల్ల అమ్మానాన్నల దగ్గర అపురూపంగా పెరుగుతుంది. పెళ్లై అత్తారింటికి వెళితే అక్కడ అందరూ కొత్త. అదే మనసుకు నచ్చినవాడు జీవిత భాగస్వామిగా దొరికితే ఎన్ని ఆటంకాలనైనా అధిగమించేస్తుంది. ఎలా ఉన్నా బ్రతికేస్తుంది.
జీవితాన్ని ఎవరితో పంచుకోవాలనేది ఏనాడో ముడిపడే ఉంటుంది. ఎవరికి ఎవరితో రాసి పెట్టి ఉంటే వారితోనే పెళ్లిళ్లు జరుగుతాయంటారు. తనకు ఇష్టమైనవాడు, తనని ఇష్టపడినవాడు మనువాడితే ఆ మగువకు అంతకంటే ఆనందం ఇంకేం ఉంటుంది. అందుకేనేమో ఆమె మెడలో అతడు మూడు ముళ్లు వేయగానే మురిసిపోతుంది.. ముద్దులు పెడుతోంది.
చెన్నైకి చెందిన ఓ వివాహ వేడుకలో పెళ్లి కూతురు ఆనందంతో ఉప్పొంగి పోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ నెటిజన్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. మీరు కూడా ఇలాగే ఉంటారా అని రాసుకొచ్చారు.
ప్రేమ పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటే ఇలానే ఆనందంగా ఉంటారు మరి అని ఒకరు పెడితే.. ఇష్టపడి చేసుకుంటే ఇద్దరూ సంతోషంగా ఉంటారు. పెద్దల ఆశీర్వచనాలు కూడా తోడైతే అంతకంటే ఆనందం ఇంకేం ఉంటుంది అని ఈ కొత్త జంటను అభినందిస్తున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని కామెంట్లు పెడుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com