Viral News: అర్థరాత్రి రోడ్డు మీద అక్కాతమ్ముళ్లు.. స్విగ్గీ డెలివరీ బాయ్ దేవుడిలా..
Viral News: కొన్ని సంఘటనలు చూసినప్పుడు, విన్పప్పుడు మానవత్వం ఇంకా మిగిలే ఉందని స్పష్టం చేస్తుంటాయి. అర్థరాత్రి, అపరాత్రి అయినా, జోరున వర్షం కురుస్తున్నా, ఎండ మండిపోతున్నా డెలివరీ బాయ్ లు వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తుంటారు.. కస్టమర్ ఆర్డర్ చేసిన వస్తువులను సమయానికి వారికి అందించడమే వారి ప్రధమ కర్తవ్యంగా భావిస్తుంటారు. మరికొందరు డ్యూటీతో పాటు పరిస్థితులకు అనుగుణంగా స్పందించే గుణాన్ని అలవరుచుకుంటారు. తాజాగా ముంబయి అమ్మాయి తనకు జరిగిన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అక్షిత చంగన్.. ఈ పోస్ట్‌లో అర్ధరాత్రి దేవదూతలా వచ్చిన స్విగ్గీ డెలివరీ బాయ్ రోషన్ దల్వీ తనకు, తన సోదరుడికి ఎలా సహాయం చేశాడో రాసుకొచ్చింది. అర్ధరాత్రి అక్కాతమ్ముళ్లిద్దరూ ఎక్కడికో వెళుతుండగా ఒక్కసారిగా బైక్ లో పెట్రోల్ అయిపోయింది. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేరు. చలిగా కూడా ఉంది. ఇంతలో డెలివరీ బాయ్ రోషన్ దల్వీ ఏమీ ఆలోచించకుండా బైక్‌లోని పెట్రోల్ తీసి వారికి ఇచ్చాడు. ఈ ఘటన జనవరిలో జరిగినట్లు సమాచారం అయితే ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అక్షిత పోస్ట్ చూసిన తర్వాత అందరూ డెలివరీ బాయ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో, వారి బైక్‌లో అకస్మాత్తుగా పెట్రోల్ అయిపోవడంతో, ఇద్దరు రహదారిపై ఒంటరిగా ఉన్నారు. జనవరి నెల కావడంతో రాత్రిపూట చలి మరింత ఎక్కువగా ఉంది. మా ఇద్దరికీ చాలా భయం వేసింది. చుట్టు పక్కల ఎవరూ కనిపించట్లేదు.. పెట్రోల్ బంక్ కూడా దరిదాపుల్లో ఉన్నట్టు లేదు.
కంగారుగా అనిపించింది. అదే సమయంలో అటుగా వస్తున్న బైక్ రైడర్ ని గమనించాడు అక్షిత సోదరుడు. అతను స్విగ్గీ డెలివరీ బాయ్ రోషన్ దల్వి. అక్షిత సోదరుడు ఆలస్యం చేయకుండా దాల్వీ వైపు పరిగెత్తాడు. ఆపై తన బైక్‌ను పెట్రోల్ పంపు వరకు నెట్టమని అభ్యర్థించాడు. అయితే దల్వీ,
వారిని ఖాళీ వాటర్ బాటిల్ అడిగాడు. అక్షిత దగ్గర అది కూడా లేదు. దల్వీ తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్‌ను ఖాళీ చేశాడు. అనంతరం తన బైక్‌లో ఉన్న పెట్రోల్ తీసి అక్షిత సోదరుడికి ఇచ్చాడు. తాను ఇప్పటివరకు డెలివరీ బాయ్ ల ఔదార్యం గురించి వినడమే కానీ, ఒక రోజు అర్ధరాత్రి తాను దానిని స్వయంగా అనుభవిస్తానని తనకు తెలియదని అక్షిత తన పోస్ట్ ద్వారా వెల్లడించింది. దల్వి నిస్వార్థ సేవను ప్రశసించింది. అక్షిత పోస్ట్ వైరల్ అవడంతో నెటిజన్స్ డెలివరీ బాయ్ ని ప్రశంసిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com