సెలబ్రిటీగా మారిన 'బుల్లెట్టు బండి' వధువు.. ఆమె పేరేంటో తెలుసా?

సెలబ్రిటీగా మారిన బుల్లెట్టు బండి వధువు.. ఆమె పేరేంటో తెలుసా?
ఆడపిల్లను అత్తవారింటికి పంపించేప్పుడు సాధారణంగా పెళ్లికూతురు, తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటారు.

ఆడపిల్లను అత్తావారింటికి పంపించేప్పుడు సాధారణంగా పెళ్లికూతురు, తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ ఇక్కడి ఊరేగింపు అందుకు డిఫరెంటుగా సాగింది. కన్నీళ్లులేవ్, కనిపెంచిన వారిని పట్టుకుని ఏడవడాళ్లేవ్. ఓన్లీ డ్యాన్స్‌ మాత్రమే. డీజే సౌండ్‌కు తగ్గట్టుగా స్టెప్పులేస్తూ అక్కడున్న వాళ్లందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది పెళ్లికూతురు. బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తాపా అంటూ డాన్స్ చేస్తూ కుర్రాళ్లకే షాక్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

వైరల్ గా మారిన ఈ వీడియో పైన ఆ కపుల్స్ స్పందించారు. TV5కి తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ అమ్మాయి పేరు సాయి శ్రీయ.. మంచిర్యాలకి చెందిన అమ్మాయి. అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్‌ఎస్‌వో రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు. ఈ నెల 14న రామక్రిష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో ఆమెకి వివాహం జరిపించారు. పెళ్లి అయ్యాక అప్పగింతల సమయంలో వధువు చేసిన డ్యాన్స్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా నెటిజన్లను వీపరితంగా ఆకట్టుకుంది. దీనితో సాయి శ్రీయ ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది.

దీనిపైన టీవీ5 తో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ పాటను తన భర్తకి డెడికేట్ చేశానని అందుకే అలా డాన్స్ చేశానని చెప్పుకొచ్చింది. కాగా సాయి శ్రీయ ప్రస్తుతం విప్రోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, ఆమె భర్త అశోక్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు.


Tags

Read MoreRead Less
Next Story