Carol H Mack: 70 ఏళ్ల వయసులో భర్తను దూరం చేసుకుంది.. 73 ఏళ్లకు మళ్లీ ప్రేమలో పడింది..

Carol H Mack (tv5news.in)

Carol H Mack (tv5news.in)

Carol H Mack: అయితే నెటిజన్లంతా కరోల్ భర్త మృతి చెందాడు అనుకొని తనపై సానుభూతి చూపించారు.

Carol H Mack: కరోనా అనే మహమ్మారి చాలామందికి తమరు ప్రేమించిన వారిని దూరం చేసింది. చాలామందికి ఒంటరి జీవితం అంటే ఎలా ఉంటుందో చూపించింది. అలాంటప్పుడు చిన్నవారి నుండి పెద్దవారి వరకు వయసుతో సంబంధం లేకుండా కాలక్షేపం కోసం ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగించడం మొదలుపెట్టారు. అలా అమెరికాకు చెందిన 73 ఏళ్ల వృద్ధురాలు ఇంటర్నెట్ వల్లే తనకు మళ్లీ ప్రేమ దొరికింది అంటూ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.

ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు. అందుకే ఏ వయసు వారైనా ప్రేమలో పడొచ్చు అనే సూత్రలు ఇప్పటికీ మనం చాలానే విని ఉంటాం. అయితే అందుకు తగిన ఉదాహరణలు కూడా మన చుట్టూ చాలానే ఉంటాయి. అందులో ఒక ఉదాహరణే అమెరికాకు చెందిన 73 ఏళ్ల వృద్ధురాలు కరోల్ హెచ్ హ్యాక్‌ది. ఇటీవల తాను ప్రేమలో పడిన విషయాన్ని చెప్తూ కరోల్ ఓ ట్వీట్ చేసింది.

'జీవితం చాలా వింతది. పెళ్లయి దాదాపు నాలుగు దశాబ్దాలు అయిపోయిన తర్వాత, నాకు 70 ఏళ్లు వచ్చిన తర్వాత నేను మళ్లీ సింగిల్‌గా మిగిలిపోతాను అనుకోలేదు. అలాగే 73 ఏళ్ల వయసు వచ్చాక, మహమ్మారి సమయంలో నాకు మంచి స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుందని అస్సలు అనుకోలేదు. అందుకే ఇప్పుడు ఇలా..' అంటూ తన ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను పోస్ట్ చేసింది కరోల్.

అయితే నెటిజన్లంతా కరోల్ భర్త మృతి చెందాడు అనుకొని తనపై సానుభూతి చూపించారు. కానీ తన భర్త చనిపోలేదని తనకు మరో మహిళతో సంబంధం ఉందని తెలుసు కరోల్ తనను వదిలేసిందని తెలిపింది. అంతే కాకుండా తన భర్తతో విడిపోయిన తర్వాత కరోల్ తన ప్రొఫైల్‌ను సంబంధాల కోసం పెట్టిందని అదే సమయంలో తనలాగా ఆలోచించే వ్యక్తి తనకు దొరికాడని చెప్పింది.

Tags

Next Story