Chhattisgarh : అంబులెన్స్‌ లేకపోవడంతో.. 10 కిలోమీటర్లు కుమార్తె మృతదేహాన్ని భుజాలపై మోసుకుని..

Chhattisgarh : అంబులెన్స్‌ లేకపోవడంతో..  10 కిలోమీటర్లు కుమార్తె మృతదేహాన్ని భుజాలపై మోసుకుని..
Chhattisgarh : ఆమదాల గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్ అనారోగ్యంతో ఉన్న తన ఏడేళ్ళ కుమార్తె సురేఖను తెల్లవారుజామున లఖన్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువచ్చాడు.

Chhattisgarh : ప్రభుత్వాసుపత్రిలో అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో ఒక వ్యక్తి తన ఏడేళ్ల కుమార్తె మృతదేహాన్ని ఓ తండ్రి తన భుజాలపై మోసుకుని 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. దీనితో ఈ ఘటన పైన ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి విచారణకు ఆదేశించారు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆమదాల గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్ అనారోగ్యంతో ఉన్న తన ఏడేళ్ళ కుమార్తె సురేఖను తెల్లవారుజామున లఖన్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువచ్చాడు. అయితే అప్పటికే ఆమె ఆరోగ్యం విషమించడంతో వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆ చిన్నారి ప్రాణాలు దక్కలేదు. అయితే మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆసుపత్రిలో అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో ఈశ్వర్ తన భుజాలపైన మోసుకుని పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామానికి తీసుకెళ్ళాడు.

రోడ్డుపై ఈశ్వర్ వెళ్తుండగా కొందరు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారి ఇది మంత్రి దృష్టికి వెళ్ళింది. దీనిపైన ఆరోగ్య శాఖా మంత్రి టీఎస్‌ సింగ్ దేవ్ విచారణకి ఆదేశించారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అయితే దీనిపైన ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ.. అంబులెన్స్‌ వస్తుందని తాము చెప్పినప్పటికీ ఆ కుటుంబం వినకుండా వెళ్లిపోయిందని చెబుతున్నారు.


Tags

Read MoreRead Less
Next Story