Oppenheimer: సెక్స్ సీన్‌లో భగవద్గీత, వివాదంలో ఓపెన్‌హైమర్

Oppenheimer: సెక్స్ సీన్‌లో భగవద్గీత, వివాదంలో ఓపెన్‌హైమర్

ప్రముఖ దర్శకుడు, మిస్టీరియస్ చిత్రాలను తీసే హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్(Christopher Nolan) తీసిన నూతన చిత్రం ఓపెన్‌హైమర్(Oppenheimer) జులై 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. భౌతిక శాస్త్రవేత్త, అణుబాంబు(Atomic bomb) పితామహుడిగా పేరుపొందిన రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితచరిత్ర ఆధారంగా, అణుబాంబు తయారీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పీకీ బ్లైండర్స్(Peacky Blinders) వెబ్‌ సిరీస్‌ ప్రధాన నటుడు, ప్రముఖ హీరో సిలియన్ మర్ఫీ ప్రధానపాత్ర పోషించాడు.


ఈ చిత్రం భారతదేశంలోనూ విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్లింది. అందులోని కొన్ని సీన్లు ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఆ విమర్శలకు మన పవిత్ర గ్రంథం భగవద్గీతని ఉపయోగించడం నిలిచింది.

సిలియన్ మర్ఫీ, హీరోయిన ఫ్లోరెన్స్ పఫ్ మధ్య జరిగే శృంగార సన్నివేశం(Sex Scene)లో మర్ఫీ భగవద్గీత(Bhagavadgeetha)లోని వాఖ్యాలు చదువుతూ కనిపిస్తాడు.

"నేను ఇప్పుడు లోకాన్ని నాశనం చేసే మృత్యువునయ్యాను.." అంటూ గీతలోని వాఖ్యాల్ని ఆ సన్నివేశంలో అంటూ కనిపిస్తాడు. ఇదే ఇప్పుడు వివాదాలకు, విమర్శలకు తావిచ్చింది. భారతీయుల మనోభావాలను దెబ్బతీసిందని అభిమానులు ఆగ్రహానికి లోనవుతున్నారు. చిత్రంలోని సన్నివేశాల్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బాయ్‌కాట్ ఓపెన్‌హైమర్ ట్రెండ్ కూడా మొదలైంది.

ఇటువంటి సీన్లను సెన్సార్ బోర్డ్ ఎలా అనుమతిచ్చిందని తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్‌(Twitter)లో దీనిపై అభిమానులు తమకు తోచిన రీతిలో స్పందిస్తున్నారు.

"హాలివుడ్ కూడా ఇప్పుడు కొన్ని నీతి నియమాలు పాటించాలి. ఇందులో సెక్స్ సీన్‌లో మర్ఫీ భగవద్గీత చదువుతున్న సన్నివేశాలున్నాయి. ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలి. హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడం మానుకోవాలి " అని ఓ యూజర్ అన్నాడు.

"కొన్ని అభ్యంతర పదాలను మ్యూట్ చేసిన సెన్సార్ బోర్డ్, ఇటువంటి దైవదూషణ సన్నివేశాలకు అనుమతి ఎలా ఇచ్చిందని" మరో యూజర్ అన్నారు.




Tags

Read MoreRead Less
Next Story