హ్యాట్సాఫ్ .. మానవత్వాన్ని చాటిన సీఐ రమేష్ కుమార్..!

పోలీసులంటే కఠినలు మాత్రమే కాదు.. ఆర్థ్రతతో కూడిన హృదయాలను కూడా కలిగి ఉంటారు. అందుకు ఈ సంఘటన అద్దం పడుతుంది. నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ ఉండడంతో శాయంపేట రూరల్ సీఐ రమేశ్ బాబు సీఎం బందోబస్త్‌లో భాగంగా ఎంజీఎం హాస్పిటల్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో ఓ వృద్దురాలు అనారోగ్యంతో అవస్థపడుతూ ఇబ్బంది పడుతూ... ఎటూ కదలలేని స్థితిలో ఉంది. అయితే దీనిని గమనించిన సీఐ రమేష్ కరోనాని కూడా లెక్కచేయకుండా మానవీయంగా స్పందించాడు. ఆ వృద్ధురాలిని తన చేతులతో ఎత్తుకొని ఆటో ఉన్న స్థలానికి ఎత్తుకొని వెళ్లి చికిత్స కోసం ఆసుపత్రికి పంపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సీఐ సహృదతయను చూసి పరకాల ఏసీపీ శ్రీనివాస్ అభినందించి హర్షం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com