మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ పై ట్రోల్స్..!

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ పై ట్రోల్స్..!
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీనికి ఆయన చేసిన పనే కారణం.. ఇంతకీ ఆయన ఏం చేశారంటే..

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీనికి ఆయన చేసిన పనే కారణం.. ఇంతకీ ఆయన ఏం చేశారంటే.. రెండు రోజుల క్రితం శివరాజ్ సింగ్.. భోపాల్ లో ఓ మొక్కను నాటి.. దానికి నీళ్ళు పోశారు. అంతాబాగానే ఉంది కానీ.. ఆయన నీళ్ళు పోసిన పరిస్థితులే కామెడీగా మారాయి. ఓ పక్కా వర్షం పడుతుంటే ఆయన మొక్కలకి నీళ్ళు పోశారు. మళ్ళీ గన్‌‌మెన్‌‌తో గొడుగు పట్టించుకోని, చిత్తడి నెల పై బండలు వేయగా ఆయన ప్రత్యేకంగా మొక్కకు నీళ్ళు పోశారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ గా మారింది. దీనితో ఆయన పైన సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రైతు కుమారుడు శివరాజ్‌‌జీ.. తడి నేల మీద ఖరీదైన రాళ్లు వేసి, వర్షంలో గొడుగుతో మొక్కలకు నీళ్లు పోస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story