TOMATO THEFT: టమాట వాహనం హైజాక్... దంపతుల అరెస్ట్
టమాటా(TOMATO) ధరలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా కిలో టమా ధర సగటున రూ.200 పలుకుతోంది. భారీ ధరలతో వినియోగదారులు కూరల్లో టమాటా వేయడమే మానేశారు. కొందరు వెరైటీగా పెళ్లిళ్లలో గిఫ్ట్‌లుగా ఇస్తున్నారు. మరికొందరు టమాటాలను కోటీశ్వరులు అయిపోతున్నారు. అందుకే ఇప్పుడు దొంగల కన్ను టమాటా((Tomato) లపై పడింది. రోజూ ఎక్కడో చోట టమాటాల దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. టామాటా ధరలు అమాంతంగా పెరగడంతో కొనేవారి కన్నా దొంగతనం(TOMATO THEFT) చేసేవారు ఎక్కువయ్యారు. టమాటాలను అమ్మి కోటీశ్వరులు కావాలన్న ఆశతో కొందరు టామాటాలను దోచేస్తున్నారు.
తాజాగా బెంగళూరులో టమాటా లోడ్ తో వెళుతున్న వాహనాన్ని ఇద్దరు దంపతులు హైజాక్(Hijack Lorry ) చేశారు. తమ కారును బొలెరో వాహనం ఢీకొట్టిందని, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు రైతు ఒప్పుకోకపోవడంతో అతనిపై దాడిచేసి రెండున్నర టన్నుల టమాటా(2.5 Tonnes Of Tomato ) లోడ్ ఉన్న బొలెరో వాహనంతో ఉడాయించారు. రైతు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వాహనాన్ని ట్రాక్ చేసి పట్టుకున్నారు. టమాటాల విలువ రెండున్నర లక్షలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు. బొలెరోతో ఉడాయించిన దంపతులు జాతీయ రహదారులపై దొంగతనాలకు పాల్పడుతుంటారని పోలీసులు తెలిపారు.
దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటడంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పందించింది. ఢిల్లీ తదితర ప్రాంతాల్లో సబ్సిడీపై టమాటా సరఫరా చేస్తోన్న కేంద్రం.... మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కొత్త పంట అధికంగా మార్కెట్లోకి సరఫరా అయితేనే ధరలు తగ్గుతాయని పేర్కొంది. వర్షాకాలంతోపాటు పలు ఇతర సమస్యల కారణంగా కిలో టమాటా ధర దాదాపు వంద రూపాయలు దాటిపోయింది. ఈ నేపథ్యంలో టమాటా ధరల పెరుగుదలకు సంబంధించి రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మహారాష్ట్రలోని నాసిక్, నార్యంగావ్, ఔరంగాబాద్ బెల్ట్‌తో పాటు మధ్యప్రదేశ్ నుంచి కొత్త పంట భారీగా సరఫరా జరిగితేనే టమాటా ధరలు దిగివస్తాయని భావిస్తున్నట్టు పేర్కొన్నారు..
సంగారెడ్డి జిల్లాలోనూ టమాటాలను చోరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. జహీరాబాద్ లోని కూరగాయల మార్కెట్ లో ఈ ఘటన జరగడంతో కొందరు షాక్ కు గురయ్యారు. మార్కెట్ లో కూరగాయల షాప్ ముందు టమాటా బాక్సులను అమ్మడానికి తెల్లవారుజామున వచ్చిన రైతులు బయటికి వెళ్లి వచ్చేసరికి లోపలికి ప్రవేశించి మూడు టమాటా బాక్సులను దొంగ ఎత్తుకెళ్లాడు. బైక్ పై వచ్చిన దొంగ హెల్మెట్ ధరించి మూడు సార్లు టమాటా బాక్సును దొంగతనం చేశాడు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. టమాటాలు చోరీ చేసిన వ్యక్తిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com