Viral Video: బ్రతుకు పోరాటం.. రోడ్డుపై రాజ్మా చావల్‌ అమ్ముతూ..

Viral Video: బ్రతుకు పోరాటం.. రోడ్డుపై రాజ్మా చావల్‌ అమ్ముతూ..
Viral Video: జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎవరి జీవితాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలియదు.

Viral Video: జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎవరి జీవితాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలియదు.. కాలు, చెయ్యి బాగున్నప్పుడు కష్టపడాలి.. ఒకరిమీద ఆధారపడకూడదు.. అదే గౌరవంగా ఉంటుందని నమ్మారీ దంపతులు. ఫరీదాబాద్‌కు చెందిన ఈ జంట లాక్‌డౌన్ సమయంలో ప్రింటింగ్ వ్యాపారం పక్కదారి పట్టడంతో ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించారు. వారు తమ స్వంతంగా ఏదైనా ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఫరీదాబాద్‌లోని గ్రీన్‌ఫీల్డ్ కాలనీ గేట్ నంబర్ 5కి దగ్గరగా ఉన్న స్టాండ్‌లో రూ.40లకు రాజ్మా చావల్ లభ్యమవుతుంది. ఈ వీడియో చూసిన ప్రజలు ఇంట్లో తయారుచేసిన భోజనం రుచికరంగా ఉంటుంది అని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ జతిన్ సింగ్ తన పేజీ, foody jsvలో పోస్ట్ చేశారు. నెటిజన్లు ఈ జంటపై విపరీతమైన ప్రేమ, అభిమానం కురిపిస్తున్నారు. నిజమైన ప్రేమకు నిర్వచనం ఈ భార్యాభర్తలు. ఇద్దరూ కలిసి పని చేసుకుంటున్నారు. “దేవుడు మీ ఇద్దరినీ ఆశీర్వదిస్తాడు. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మే వారిని ప్రమోట్ చేస్తున్న అడ్మిన్ మంచి పని చేసాడు. చాలా మంది వినియోగదారులు ఇంట్లో తయారుచేసిన రాజ్మా, కధీ చావల్‌ని ప్రయత్నించడానికి స్టాల్ దగ్గర గుమికూడారు. ఈ జంట యొక్క వైరల్ వీడియోకు 672K వీక్షణలు, 29.2K లైక్‌లు మరియు 80కి పైగా కామెంట్‌లు వచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story