Cricketer Rishabh Pant: ఆసుపత్రిలో క్రికెటర్.. నటి క్రిప్టిక్ పోస్ట్.. భారీ ట్రోలింగ్..
Cricketer Rishabh Pant: క్రికెటర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డెహ్రాడూన్ లోని మ్యాక్స్ హాస్పిటల్ లో పంత్ చికిత్స పొందుతున్నాడు. ఇక ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జన్ల పర్యవేక్షణలో ఉన్న రిషబ్ కోలుకోవాలని యావత్ ప్రపంచం ప్రార్థిస్తోంది. కానీ ఓ బాలీవుడ్ బ్యూటీ మాత్రం ఏకంగా తన గ్లామరస్ పిక్ పోస్టు చేసి, ప్రేయింగ్ అంటూ క్రిప్టిక్ పోస్ట్ పెట్టింది. ఇది రిషబ్ కోసమా లేక మరేదైనానా అన్న సంగతి పక్కన పెడితే నెటిజన్లు మాత్రం అమ్మడిపై ట్రోలింగ్స్ మొదలుపెట్టేశారు.
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా-రిషబ్ పంత్ ఇరువురూ ఒకర్ని ఒకరు ఇష్టపడ్డారని.. ప్రేమలో ఉన్నారని అప్పట్లో మీడియాలో రకరకాల కథనాలు వచ్చేవి. కానీ ఈ వార్తల పై వీరు ఏ మాత్రం స్పందించలేదు. దీంతో వీరు స్నేహితులా లేక ప్రేమికులా అన్న విషయంపై ఎవ్వరికి క్లారిటీ లేదు.ఈ విషయం పక్కన పెడితే, తాజాగా రిషభ్ కు జరిగిన ప్రమాదం పై పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు సైతం రిషభ్ కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో నటి ఊర్వశి రౌతేలా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ గ్లామరస్ పిక్ పోస్టు చేస్తూ, ప్రేయింగ్ అంటూ క్రిప్టిక్ పోస్ట్ పెట్టింది. దీంతో రిషబ్ క్లిష్ట పరిస్ధితిలో ఉండగా, తను అలా పోస్టు పెట్టడం వెనుక అర్ధం ఏంటంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. అసలు రిషబ్ అలాంటి స్ధితిలో ఉంటే, అలాంటి పోస్టు ఎలా పెడతావు అంటూ నటి పై ఓ రేంజ్ తో ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. మరోవైపు రిషబ్‌కు ప్రార్థనలు కావాలి కానీ, ఆమె డ్రామా కాదు అంటూ రిషబ్ ఫ్యాన్స్ తీవ్ర స్ధాయిలో మండిపడుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com