Tea.. కప్పు టీ రూ.1000.. కార్లలో వచ్చి మరి క్యూ కడుతున్న జనం!
Cup Tea 1000 rs
అందులో టీ ఆకులు వేస్తారా లేక బంగారం రేకులు వేస్తారా.. ఎందుకు బాబు అంత రేటు.. పోనీ తాగితే ఏమైనా కిక్కొస్తుందా.. మామూలుగా రూ.10, రూ.20లు తెలుసు.. పోనీ బాగా రుచిగా ఉందంటే ఓ వంద రూపాయలు వేసుకో.. అంతేగానీ మరీ వెయ్యి రూపాయలు ఏంటి బాస్.. అదీ ఏ స్టార్ హోటల్‌లోనో అనుకుంటే పొరపాటే.. రద్దీగా ఉండే కలకత్తా నగరంలోని ఓ గల్లీ. ఆ వీధిలో ఓ చిన్న బడ్డీ కొట్టు. అవును ఫైవ్ స్టార్ హోటల్ తరహాలో 'టీ' కి ఉండే రేటు.. ఈ చిన్న బడ్డీ కొట్టులో ఉంది.
అయినా ఈ చిన్న బడ్డీలో అంత రేటు పెట్టి టీ ఎందుకు తాగుతారులే అనుకోవద్దు.. ఎందుకంటే ఈ టీ కోసం జనాలు కార్లలో వచ్చి మరి లైన్లు కడతారు. మరి ఈ టీ అంత ఖరీదు ఎందుకంటే.. ఈ టీ పొడి కిలో ధర రూ.3 లక్షలు వరకు ఉంటుంది. అందుకే.. కప్పు టీ ధర అంత రేటు పలుకుతోంది. దీని పేరు 'బో-లే టీ'.
వెస్ట్ బెంగాల్‌లో పార్థ ప్రతీమ్ గంగూలీ అనే వ్యక్తి ఈ టీ స్టాల్‌ను నడుపుతున్నారు. ముకుందపూర్‌లో ఉన్న ఈ టీ స్టాల్‌లో.. సిల్వర్ నీడిల్ వైట్ టీ, లావెండర్ టీ, మందార టీ, వైన్ టీ, తులసీ అల్లం టీ, బ్లూ టిసానే టీ, టీస్టా వ్యాలీ టీ, మకైబరీ టీ, రూబీయోస్ టీ, ఓకేటీ టీ వంటి వంద రకాల టీలు లభిస్తాయి. ఈ టీస్టాల్ యజమాని గంగూలీ.. 2014లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ టీస్టాల్ ప్రారంభించారు. అప్పటి నుంచి రకరకాల టీలతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. టీ మాత్రమే కాకుండా ప్రపంచంలో దొరికే రకరకలా టీ పొడిలను కూడా ఇక్కడే విక్రయిస్తున్నాడు. మరి మీరు ఎప్పుడైనా ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు తప్పకుండా 'బో-లే టీ' ఒకసారి రుచి చూసి రండి.
ALSO WATCH : కర్ణాటక మంత్రి రాసలీలల వీడియో కలకలం
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com