viral video: అంబానీ ఇంట అదిరే విందు.. స్పెషల్ డిష్‌లో కరెన్సీ నోట్లు..
viral video: అపర కుబేరులు అంబానీలు.. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంట ఏ వేడుక జరిగినా బాలీవుడ్ తారలంతా హాజరవుతారు. ఇక ఇక్కడ అతిధులకు వడ్డించే విందు భోజనం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు ఎవరైనా, వెండి కంచాల్లో వడ్డించే రుచికరమైన భోజనం అతిధులను అలరిస్తుంది. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ కలల ప్రాజెక్ట్ నీతా ముకేశ్ అంబానీ సాంస్కృతిక కేంద్రం (NMACC) ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులకు విందు ఇచ్చారు. అయితే ఈ విందులో ప్రత్యేకంగా ఆకర్షించింది ఓ డిజర్ట్. ఆ స్వీటుతో పాటు కరెన్సీ నోట్లు ఉంచారు. టిష్యూ పేపర్స్ బదులు కరెన్సీ నోట్లను ఉంచారేమో అని నెటిజన్లు ఫోటోలను చూసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అవి నిజమైన కరెన్సీ కాదని తేలింది. ఇది దిల్లీలో పాపులర్ వంటకం దౌలత్ కి చాట్.. ఈ స్పెషల్ మెనూ ఉత్తర భారత్‌లోని పలు ప్రాంతాల్లో కేవలం శీతాకాలంలో మాత్రమే రెండు నెలల పాటు లభిస్తుంది. చిక్కటి పాల నుంచి తీసిన నురుగు, పిస్తా, కోవా, చక్కెర పొడితో ఈ స్వీట్ తయారు చేస్తారు. ఇండియన్ అసెంట్ అనే రెస్టారెంట్ ఈ డిజర్ట్‌తో నకిలీ కరెన్సీ నోట్లు పెట్టి ప్రత్యేకంగా విక్రయిస్తోంది. దాంతో ఈ వంటకం చాలా పాపులర్ అయ్యింది. ఇక ఈ వంటకమే అంబానీ పార్టీలో కూడా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. మూడు రోజులు జరిగిన ఈ వేడుకలకు దేశంలోని అతిరథ మహారధులందరూ తరలి వచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com