LUCIDI: సాహసం చేస్తూ 68 వ అంతస్తు నుంచి పడి....
అత్యంత ఎత్తైన భవనాలను సునాయసంగా(Skyscraper Climbs) ఎక్కి డేర్ డేవిల్(Daredevil)గా పేరుగాంచిన వ్యక్తి సాహసం చేస్తూనే మరణించాడు. ఫ్రాన్స్ కు చెందిన 30 ఏళ్ల సాహస క్లయింబర్ రెమి లూసిడి (Remi Lucidi) సాహస విన్యాసం చేస్తూనే దుర్మరణం పాలయ్యాడు. రెమి లూసిడి(Mr Lucidi's)ని సోషల్ మీడియాలో అందరూ ‘రెమి ఎనిగ్మా’ అని పిలుస్తారు.
ఏ సాహసాలైతే తనకు అంత పేరు తెచ్చాయే అవే సాహసం చేస్తూ రెమమి లూసిడి మృత్యు ఒడిలోకి జారుకోవడం విషాదంగా మారింది. అతడి సాహసోపేత విన్యాసాలు చూస్తుంటే మనకే గుండె ఆగిపోయినంత పనవుతుంది. వయసు 30 ఏళ్లే అయినా.. ఇప్పటిదాకా భారీ భవనాలను అవలీలగా ఎక్కేసి అందరితో లూసిడి డేర్ డెవిల్(30-year-old French daredevil) అనిపించుకున్నాడు. హాంకాంగ్‌లోని ట్రెగుంటర్ టవర్ (Tregunter Towers) కాంప్లెక్స్‌పైకి ఎక్కుతుండగా.. 68వ అంతస్తు(68th Floor) నుంచి కింద పడిపోయి రెమి లూసిడి ప్రాణాలు కోల్పోయాడు. 721 అడుగుల ఎత్తు నుంచి పడటంతో అక్కడిక్కక్కడే చనిపోయాడు.
అనుమతులు లేకుండా లూసిడి ఆ భవనంపైకి చేరుకున్నాడని అధికారులు తెలిపారు. అత్యంత ఎత్తైన భవనాలను అధిరోహించడంలో నేర్పరిగా రెమీ లుసిడి (Remi Lucidi)కి పేరొంది. ప్రమాదాలతో చెలగాటమాడటం లూసిడికి మహా సరదా. లూసిడిసోమవారం ఉదయం 6 గంటల సమయంలో భవనం సెక్యూరిటీ వద్దకు వచ్చాడని.. 40వ అంతస్తులో తన మిత్రుడు ఉన్నాడని చెప్పి లోపలకు వెళ్లిపోయాడని హాంకాంగ్ పోలీసులు తెలిపారు. కానీ, 40వ అంతస్తులో సదరు వ్యక్తి.. లుసిడి ఎవరో తనకు తెలియదని సెక్యూరిటీకి చెప్పాడు. అప్పటికే లుసిడి ఎలివేటర్‌లో పైకి వెళ్లడం మొదలుపెట్టాడు. అతడు 49వ ఫ్లోర్ నుంచి మెట్ల మార్గంలో పైకి వెళ్లినట్లు అక్కడి వారు చెబుతున్నారు. కానీ, భవనం పైకప్పుపై మాత్రం కనిపించలేదని పేర్కొన్నారు.
లూసిడిని పెంట్‌హౌస్‌లో పనిమనిషి చూసి పోలీసులకు కాల్ చేసింది. అనంతరం అతడు పట్టుతప్పి కిందపడిపోయాడు. అతడు బ్యాలెన్స్ తప్పడంతో సాయం కోసం కిటీకిని తన్ని ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో లూసిడి కెమెరాను స్వాధీనం చేసుకొన్నారు. అందులో అతని ఎత్తైన భవనాలు ఎక్కిన వీడియోలు ఉన్నాయి. లూసిడి కాలు జారి కింద పడిపోయి మరణించాడని ప్రాథమికంగా నిర్ధారించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com