Viral Love Story: సైకిల్ మెకానిక్ కూతురితో ప్రేమలో పడిన ఆస్ట్రేలియన్.. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం

Viral Lover Story: ఈ జంట హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 2న విదేశాల్లోని కోర్టులో పెళ్లి కూడా చేసుకున్నారు. నిజమైన ప్రేమకు సరిహద్దులు, దూరం అవసరం లేదు అని నిరూపించారు ఈ జంట. ఆస్ట్రేలియా నుండి తాను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి మధ్యప్రదేశ్‌కు వచ్చాడు యాష్ హాన్స్‌చైల్డ్,
మధ్యప్రదేశ్‌లోని మనావర్‌లో నివసించే తబస్సుమ్ హుస్సేన్‌ను వివాహం చేసుకోవడానికి దాదాపు 10,000 కిలోమీటర్లు ప్రయాణించారు. డిసెంబర్ 18వ తేదీ ఆదివారం కుటుంబసభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.
తబస్సుమ్‌కు ముగ్గురు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఆమె ఇద్దరు సోదరీమణులకు వివాహమైంది. తబస్సుమ్ తండ్రి సాదిక్ హుస్సేన్ బస్టాండ్ సమీపంలోని సైకిల్ రిపేర్ షాపులో పనిచేస్తున్నాడు. ఆమె తల్లి గృహిణి.
తబస్సుమ్, యాష్ హాన్స్‌చైల్డ్ ఎలా ప్రేమలో పడ్డారు. తబస్సుమ్ తన చదువు కోసం ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఇద్దరూ కలుసుకున్నారు. వారి ప్రేమ కథ అక్కడి నుండి ప్రారంభమైంది. 2016లో ఎంపీ ప్రభుత్వం తబస్సుమ్‌కు ఉన్నత విద్య కోసం రూ.45 లక్షల గ్రాంట్‌ను మంజూరు చేసింది.
తబస్సుమ్ ఒక సంవత్సరం తర్వాత 2017లో ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు వెళ్లింది. అక్కడే పరిచయమైన యాష్‌తో తబస్సుమ్ ప్రేమలో పడింది. ఆగస్టులో కోర్టు వివాహం తర్వాత, తబస్సుమ్ కుటుంబాన్ని కలవడానికి యాష్ భారతదేశానికి వచ్చారు. యాష్ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు మరియు వంటకాలతో ప్రేమలో పడ్డాడు. యాష్ తల్లి కూడా అతనితో కలిసి భారతదేశాన్ని సందర్శించింది.
తబస్సుమ్ ప్రస్తుతం బ్రిస్బేన్‌లో సీనియర్ మేనేజర్‌గా ఒక సంస్థలో ఉద్యోగం చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com