David Warner: 'పుష్ప' సినిమాను ప్రమోట్ చేస్తున్న ఆస్ట్రేలియన్ క్రికెటర్..
David Warner (tv5news.in)
David Warner: డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ అందరిలో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు చాలా ఇష్టమైన ఆటగాడు. క్రికెట్ విషయంలోనే కాదు.. తన ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేసే విషయంలో కూడా వార్నర్ ఎప్పుడూ ముందుంటాడు. ముందుగా లాక్‌డౌన్ సమయంలో పలు తెలుగు పాటలకు డ్యాన్స్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేసేవారు వార్నర్. దీంతో ఆయన ఎంటర్‌టైన్మెంట్‌లో కూడా కింగ్ అని నిరూపించుకున్నాడు. చాలారోజుల తర్వాత మరోసారి వార్నర్ ఓ డిఫరెంట్ వీడియోతో ఫాలోవర్స్ ముందుకు వచ్చాడు.
మామూలుగా ఫ్యాన్స్.. తమకు నచ్చిన హీరో ఫేస్‌ను ఎడిట్ చేసి.. ఆ ప్లేస్‌లో తమ ఫేస్ పెట్టుకుని వీడియోలు తయారు చేస్తుంటారు. ఒకప్పుడు ఈ ట్రెండ్ బాగా నడిచేది. దీనికోసం ప్రత్యేకంగా యాప్స్ కూడా క్రియేట్ అయ్యాయి. కానీ ఇప్పుడు వాటిని పెద్దగా ఎవరూ పట్టించుకోవట్లేదు. కానీ డేవిడ్ వార్నర్ మాత్రం ఇంకా ఈ ఫేస్ ఎడిట్స్ నుండి బయటికి రాలేకపోతున్నారు.
ఇటీవల మరణించిన కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌ను గుర్తుచేసేలా తన మూవీకి సంబంధించిన ఓ సీన్‌లో పునీత్ ఫేస్ తీసేసి తన ఫేస్‌ను ఎడిట్ చేశాడు వార్నర్. ఇక తాజాగా పుష్ప సినిమాలోని ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా పాటకు ఫేస్ ఎడిట్‌ను అప్లై చేశాడు. ఇది చూసిన విరాట్ కొహ్లీ ఫన్నీగా స్పందించాడు.
'ఆర్ యూ ఓకే' అంటూ విరాట్ కామెంట్ పెట్టాడు. దానికి వార్నర్ కూడా ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. అయితే వార్నర్ సరదాగా చేసిన ఈ వీడియో పుష్ప సినిమాకు ప్రమోషన్స్ లాగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి సుకుమార్ తన సినిమా కోసం ఆస్ట్రేలియన్ క్రికెటర్‌ను రంగంలోకి దింపాడంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com