రెండు తలల పాము.. ఒకేసారి రెండు ఎలుకల్ని.. వీడియో వైరల్
పాము పేరు చెబితేనే భయం. చూడాలంటే మరింత భయం. ఇక రెండు తలల పాము కనిపిస్తే.. వామ్మో కాళ్లు చేతులు ఆడవు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో రెండు తలల పాము ఒకే సారి రెండు ఎలుకల్ని పట్టుకుని మింగేస్తోంది. వీడియో తీసిన వ్యక్తికి ఎంత ధైర్యం ఉందో కానీ.. చూసే వారికి మాత్రం చాలా ధైర్యం కావాలి. భయపడే వ్యక్తులు చూడకపోవడమే మంచిది అంటూ సదరు వీడియో తీసిన వ్యక్తి వెల్లడించడం విశేషం.
వీడియోలో కనిపించే రెండు తలల పాము ఒకేసారి రెండు ఎలుకలను తినేస్తుంది. రెండు తలల పాములకు భారీ డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. రెండు తల పాములను పట్టుకునే వారిని అరెస్టు చేయడాన్ని మనం చూస్తాము.
ఏదేమైనా, రెండు తలల పాము ఎలా ఉంటుందో తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారు ఈ వీడియో చూడొచ్చు. ఇప్పటికే వేలాది మంది వీక్షించిన స్నేక్ బైట్స్ టీవీ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో రెండు తలల పాము రెండు ఎలుకలను తింటున్న అరుదైన వీడియోను బ్రియాన్ పంచుకున్నారు.
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఈ వీడియోను చూసి ప్రజలు ఆశ్చర్యపోతూ పోస్టులు పెడుతున్నారు. కొందరు రెండు తలల పాములు ఎక్కడ ఉంటాయని అడిగితే.. మరికొందరు ఇలాంటి పామును నా జీవితకాలంలో నేను ఎప్పుడూ చూడలేదు అని రాస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com