Maggots: ముక్కులో 150 పురుగులు.. సర్జరీ చేసి తీసేసిన డాక్టర్లు..

Maggots: ముక్కులో 150 పురుగులు.. సర్జరీ చేసి తీసేసిన డాక్టర్లు..
Maggots: ఆరు నెలల క్రితం మహిళకు కోవిడ్ సోకింది. దీనికి తోడు బ్లాక్ ఫంగస్ట్ ఎఫెక్ట్ అయ్యింది.

Maggots: కోవిడ్ అనేది బ్లాక్ ఫంగస్ అనే వ్యాధికి కూడా దారితీసింది. దీన్ని మ్యుక‌ర్‌మైకోసిస్ అని కూడా అంటారు. దీని కారణంగా గుంటూరు జిల్లాకు చెందిన 50 ఏళ్ల మహిళకు స్పర్శ పోయింది. దీంతో ఆమెకు తెలియకుండానే 150 మాగ్గోట్స్ (పురుగులు) ఆమె ముక్కులోకి చేరాయి. మానసిక సమస్యతో ఆ మహిళ ఆసుప్రతిలో చేరిన తర్వాత డాక్టర్లు ఆ పురుగులను గుర్తించి షాకయ్యారు. కానీ విజయవంతంగా ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు.

ఆరు నెలల క్రితం మహిళకు కోవిడ్ సోకింది. దీనికి తోడు బ్లాక్ ఫంగస్ట్ ఎఫెక్ట్ అయ్యింది. అందుకే ఆమె తన కుడి కన్నును కూడా కోల్పోయింది. ఆ తర్వాత మెల్లగా తన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. తనకు డయాబెటీస్ కూడా ఉండడంతో తన జీవనం కష్టమయ్యింది. అప్పుడే కొన్ని పురుగులు తన ముక్కు నుండి బ్రెయిన్ వరకు వెళ్లాయి. పూర్తిగా స్పర్శ కోల్పోవడంతో ఈ విషయాలు ఏవీ తనకు తెలియలేదు.

'పేషెంట్‌కు పరీక్షలు నిర్వహించిన తర్వాత మాగ్గోట్స్ తన బ్రెయిన్ కిందే ఉన్నాయని మాకు తెలిసింది. కానీ తన కిడ్నీ ఆరోగ్యకరంగా లేకపోవడం, తనకు షుగర్ వ్యాధి ఉండడం వల్ల తన ఆరోగ్యం నిలకడ అయ్యేవరకు వేచిచూడాల్సి వచ్చింది. కొందరు డాక్టర్లు తన ఆరోగ్య నిలకడపై దృష్టిపెడితే.. మేము ఆ మాగ్గోట్స్‌ను తొలగించడంపై దృష్టిపెట్టాం. తన ఆరోగ్యం మెరుగుపడుతున్న కొద్దీ.. తన బ్రెయిన్ దగ్గర ఉన్న ఎముకలు అన్నీ పూర్తిగా ఎఫెక్ట్ అవ్వడం మేము గమనించాం. ఆ మాగ్గోట్స్ తన ముక్కు నుండి బ్రెయిన్ వరకు వెళ్లి.. అక్కడ గుడ్లు పెట్టడంతో అవి మరిన్ని మాగ్గోట్స్ సృష్టికి కారణమయ్యాయి' అని డాక్టర్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story