Viral Video: 5 నిమిషాల్లో ఆలూ సమోసా తింటే 11 వేలు.. ఎక్కడంటే..
Aloo Samosa: ఆలూ సమోసా అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. ఎంత ఇష్టమైనా ఒకటి రెండు తినగానే కడుపు ఫుల్ అయిపోయినట్లు అనిపిస్తుంది.. మూడోది తిన్నామంటే పైకే వస్తుంది.. మరి అలాంటిది 3 కేజీల ఆలూ సమోసాని 5 నిమిషాల్లో తింటే 11వేలు గెలుచుకోవచ్చు అని ఓ ఫుడ్ స్టాల్ ఓనర్ ఓ వింత ప్రపోజల్ పెట్టారు కస్టమర్లకి. యూట్యూబ్ ఫుడ్ బ్లాగర్ ఫుడీ విషాల్ దీనికి సంబంధించిన వీడియోని రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇంతకీ ఈ ఆఫర్ నడిచేది ఎక్కడంటే.. ఢిల్లీకి చెందిన ఓ రోడ్ సైడ్ ఫుడ్ కోర్ట్ లో. మొత్తానికి ఈ ఛాలెంజ్ ని గౌరవ్ ఖురానా అనే వ్యక్తి ఆ భారీ సమోసాని తిని 11 వేల రూపాయలు గెలుచుకున్నాడు. ఈ భారీ సమోసాను తినడానికి 5 నిమిషాల టైమిస్తే గౌరవ్ మాత్రం 4 నిమిషాల 51 సెకన్లలో తినేశాడు. ఘజియాబాద్ లోని షాహిబాబాద్ లో ఉన్న ఓ స్టాల్ లో ఈ యమ్మీ సమోసా దొరుకుతుంది.. ఛాలెంజ్ స్వీకరించాలంటే అక్కడకు వెళ్లాల్సిందే. ఇంతకీ ఈ సమోసా ధర ఎంతనుకున్నారు అక్షరాలా రూ.500లు. గౌరవ్ సమోసా తింటున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com