Video Viral: కొంచెం కూడా బుద్ది లేదు.. నీళ్ల కోసం వృద్ద మహిళను కాలితో..

Video Viral: కొంచెం కూడా బుద్ది లేదు.. నీళ్ల కోసం వృద్ద మహిళను కాలితో..
X
Video Viral: ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Video Viral: ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లో నీటి సరఫరా విషయంలో పొరుగువారితో వాగ్వాదం కారణంగా వృద్ధురాలిపై దారుణంగా దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిస్సహాయంగా నేలపై పడి ఉన్న మహిళను ఓ వ్యక్తి దుర్భాషలాడుతూ కాలితో తన్నుతున్నాడు.. చుట్టు పక్కల వారు చూస్తున్నారు తప్పించి అతడిని ఆపే ప్రయత్నం ఎవరూ చేయలేదు. కోపంతో ఊగిపోతున్న అతను మహిళ ముఖంపై కాలితో పదేపదే తన్నుతున్నాడు.

ఇంటి బయట ఉన్న వాటర్ ట్యాంక్‌కు పైపును బిగించే ప్రయత్నంలో మహిళకు, ఆమె పొరుగువారి మధ్య వాగ్వాదం జరిగింది. స్థానికులు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ వ్యక్తి ఆమెను దుర్భాషలాడుతూ తన్నడం ప్రారంభించాడని అధికారులు తెలిపారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు మహిళపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. "కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. వారిపై ఫిర్యాదు నమోదు చేయడంతో పోలీసులు వేగంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

Tags

Next Story