కదనరంగంలోకి కుబేరులు

ప్రపంచ కుబేరులు కదన రంగంలోకి దిగబోతున్నారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకోనున్నారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్... మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కేజ్ మ్యాచ్‌లో తలపడనున్నారు. కేజ్ మ్యాచ్‌కు సిద్ధంగా ఉండాలని జుకర్‌బర్గ్‌కు మస్క్‌కు సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను స్వీకరించిన జుకర్‌బర్గ్ అడ్రస్ ఎక్కడో చెప్పంటూ ప్రతి సవాల్ విసిరారు. ఈ సవాళ్లు ప్రతి సవాళ్లతో కూడిన ఈ సరదా ట్వీట్లతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. సోషల్ మీడియాలో మెటా ఆధిపత్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ మస్క్ సరదాగా కేజ్ ఫైట్ చేద్దామంటూ ట్వీట్ చేశారు. దీనికి అనూహ్యంగా జుకర్‌బర్గ్ స్పందించాడు. మస్క్ ట్వీట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన జుకర్‌బర్గ్.. కేజ్ ఫైట్‌కు అడ్రస్ చెప్పు అంటూ ప్రతి సవాల్ విసిరాడు. లాస్ వెగాస్‌లో పోరుకు సిద్ధంగా ఉండాలని మస్క్ సూచించాడు. కుబేరుల మధ్య జరిగిన ఈ సంభాషణ.... సరదానా.. లేక నిజమేనా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఒకవేళ కేజ్ ఫైట్ జరిగితే మార్షల్ ఆర్ట్స్ వచ్చిన జుకర్ బర్గ్... మస్క్‌ను మట్టికరిపించడం ఖాయమని నెటిజన్లు అంటున్నారు. 39 ఏళ్ల జుకర్‌బర్గ్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందాడు. ఇటీవల జియు-జిట్సు టోర్నమెంట్ కూడా గెలుచుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com