Etthara Jenda: ఐపీఎల్‌కు పాకిన 'ఆర్ఆర్ఆర్' ఫీవర్.. వీడియో వైరల్..
Etthara Jenda: 'ఆర్ఆర్ఆర్' సినిమాలో రామ్ చరణ్, ఎన్‌టీఆర్ నటనతో పాటు రాజమౌళి డైరెక్షన్‌తో పాటు పాటలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇదొక పీరియాడిక్ రివెంజ్ డ్రామా కాబట్టి దానికి తగినట్టుగానే మ్యూజిక్‌ను అందించాడు కీరవాణి. రాజమౌళి, కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన ఇతర సినిమాలలాగానే ఆర్ఆర్ఆర్ కూడా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలోని ఓ పాటను ఐపీఎల్ లవర్స్ తమకు నచ్చినట్టుగా మార్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఎడిటెడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒకవైపు థియేటర్లలో ఆర్ఆర్ఆర్, మరొకవైపు టీవీల్లో ఐపీఎల్.. అటు మూవీ లవర్స్‌కు, ఇటు క్రికెట్ లవర్స్‌కు ఫుల్ ఫీస్ట్ కానున్నాయి. ఐపీఎల్ 2022 శనివారం నుండి ప్రారంభం కానుంది. అయితే ఐపీఎల్ లవర్స్.. 'ఆర్ఆర్ఆర్'లోని ఎత్తరా జెండా పాటకు తమ వర్షన్‌ను రాసుకున్నారు.
ఆర్ఆర్ఆర్ ఒక దేశభక్తి సినిమా. 1920ల్లో జరిగిన కథతో తెరకెక్కిన సినిమా. అందుకే అప్పట్లో మన దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారందరినీ గుర్తుచేసుకుంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ సెలబ్రేషన్ ఆంథమ్‌ను విడుదల చేసింది. అదే 'ఎత్తరా జెండా'. అయితే ఈ పాటలో ప్రతీ రాష్ట్రం తరపున పోరాడిన అమరవీరుల గురించి స్పష్టంగా చెప్పారు. అయితే ఆ అమరవీరుల ప్లేస్‌లో ఐపీఎల్ టీమ్స్‌ను పెట్టి ఒకరు ఎడిట్ చేసిన వీడియో ఐపీఎల్ లవర్స్‌ను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.
IPL hype ekkindham 💉🔥🔥 pic.twitter.com/0sLfEpZx3Y
— shitposteRRR🔥🌊 (@simpszendaya) March 23, 2022
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com