ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. ముసుగులో వచ్చిన ప్రియుడు.. చివరికి అదిరిపోయే ట్విస్ట్..!

ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. ముసుగులో వచ్చిన ప్రియుడు.. చివరికి అదిరిపోయే ట్విస్ట్..!
ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తోంది.. పెళ్లి వేడుకల్లో జరిగే కొన్ని తమాషా వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌‌‌గా మారుతున్నాయి.

ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తోంది.. పెళ్లి వేడుకల్లో జరిగే కొన్ని తమాషా వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌‌‌గా మారుతున్నాయి. తాజాగా తను ప్రేమించిన అమ్మాయికి మరొకరితో వివాహం జరుగుతుందని తెలుసుకున్న ఓ ప్రియుడు పెళ్లి మధ్యలో దూరి అందరికి షాకిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన డిసెంబరు 1న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా అక్కడో పెళ్లి జరుగుతుంది. ఆ సమయంలో వధూవరులిద్దరూ దండలు మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో సడన్ గా గుంపులో నుంచి ఓ వ్యక్తి ముసుగేసుకుని వచ్చి వధువు నుదిటిపైన సింధూరాన్ని పెట్టాడు.

వధువు వారిచే ప్రయత్నం చేసింది.. అయినప్పటికీ బలవంతంగా ఆమె నుదుటిపై సింధూరాన్ని దిద్దాడు. హిందూ సాంప్రదాయ పద్దతిలో అమ్మాయి నుదిటిపైన బొట్టు పెడితే దానిని వివాహంగా భావిస్తారు. దీనిని అక్కడ అమలు చేశాడు ఆ యువకుడు. ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్‌‌‌కి గురయ్యారు అక్కడున్నవారంతా.. అనంతరం సదరు యువకుడిని పట్టుకుని చితకబాదారు.

తీరా ముసుగు తీసి చూస్తే అతను గతంలో సదరు యువతిని ప్రేమిచాలంటూ వేధించాడట. అయితే ఆమె తిరస్కరించిందట.. ఈ నేపధ్యంలో తన ప్రియురాలుకి మరొకరితో వివాహం జరుగుతుందని తెలుసుకొని ఈ ప్లాన్ వేశాడట. అయితే ఈ విషయం పై ఆ వధువు పోలీసులను ఆశ్రయించింది. ఆ మరుసటిరోజు తన తల్లిదండ్రులు చూసిన వ్యక్తినే పెళ్లిచేసుకొని సదరు యువకుడికి ఊహించని షాక్ ఇచ్చింది.


Tags

Next Story