Ram Gopal Varma : వర్మ పేరుతో హోటల్... చచ్చిపోయినట్లు అనిపిస్తుందన్న ఆర్జీవీ
Ram Gopal Varma : సెలబ్రిటీల పైన అభిమానం ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది.. కొందరు ఫ్లెక్సీ కడితే... మరొకరు టాటూలు వేయించుకుంటారు.. కానీ ఇక్కడో అభిమాని వెరైటీగా అభిమానంతో ఓ తన ఫేవరెట్ సెలబ్రిటీ పేరు పైన ఓ హౌటల్ పెట్టాడు. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు రామ్ గోపాల్ వర్మ.. సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచే ఆర్జీవీకి అతనో వీరాభిమాని.. అతనితో పాటుగా ఇంటిల్లిపాదీ కూడా వర్మ ఫ్యాన్సే.. వర్మ చెప్పే ఫిలాసఫీకి అంతా ఫిదా అయిపోయారు.
ఆ అభిమానంతో తాము పెట్టుకున్న హోటల్ కి రామ్ గోపాల్ వర్మ పేరు పెట్టుకున్నారు. అంతేకాకుండా హోటల్ నిండా వర్మ కొటేషన్స్ పెట్టారు. వర్మ పేరుతో ఓపెన్ చేసిన ఈ హోటల్ కి కూడా మంచి డిమాండ్ వచ్చిందట. త్వరలోనే మరిన్ని బ్రాంచ్‌లు ఓపెన్ చేసే పనిలో ఉన్నారట. ఇది కాస్త వర్మ దృష్టికి వెళ్ళింది. దీనితో ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
నా పేరుతో హోటల్ ఉందంటే చచ్చిపోయినట్లు అనిపిస్తుంది అని తనదైన స్టైల్‌లో ట్వీట్ చేశాడు. ఇంతకీ ఈ హోటల్ ఎక్కడో చెప్పలేదు కదూ.. తూర్పు గోదావరి జిల్లా బెండమూర్లంక గ్రామం.
A hotel on my name | I feel DEAD 😳😳😳 https://t.co/hxvKp4uKaU via @YouTube
— Ram Gopal Varma (@RGVzoomin) December 25, 2021
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com