Gay marriage in Telangana: ప్రేమలో పడ్డారు.. పెళ్లి చేసుకుంటున్నారు.. తెలంగాణలో ఇలా జరగడం ఇదే మొదటిసారి..

Gay marriage in Telangana: ప్రేమలో, యుద్ధంలో ఏదీ తప్పు కాదు అంటుంటారు. ఇంకా ప్రేమ గురించి చెప్పాలంటే.. ప్రేమకు వయసుతో సంబంధం లేదు అంటుంటారు.. ప్రేమ గుడ్డిది అని కూడా అంటారు. కనిపించని ఈ ప్రేమకు ఒక్కొక్కరు ఒక్కో అర్థం చెప్తారు. అలా ప్రేమ విషయంలో ఆదర్శంగా ఉన్న జంటలు కూడా ఎన్నో ఉన్నాయి. తాజాగా అలాంటి ఒక ఆదర్శమైన జంట త్వరలోనే పెళ్లితో ఒకటవ్వనున్నారు. కానీ ఈ జంటకు మిగతా జంటలకు చిన్న తేడా ఉంది.
ప్రేమంటే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మధ్యే ఎందుకు పుడుతుంది? ఇద్దరు అబ్బాయిలకు.. ఇద్దరు అమ్మాయిలకు కూడా కలగొచ్చు కదా.. కలగొచ్చని, వారు కలిసుండచ్చని ఇప్పటికీ ఎన్నో జంటలు నిరూపించాయి. తాజాగా ఇద్దరు పురుషుల మొదటిసారిగా ఆ విషయాన్ని తెలంగాణలో నిరూపించనున్నారు.
ఇద్దరు మగవాళ్లు పెళ్లి చేసుకున్నా.. ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకున్నా.. విదేశాల్లో వీటిని పెద్దగా వింతగా ఏమీ చూడరు. కానీ మన దేశంలో ఇలాంటి సంఘటనలు చాలా అరుదు. ఒకే జెండర్ వారిని ఇష్టపడుతున్నారంటే అది వారిలో ఉన్న హార్మన్ మార్పు అని ప్రాక్టికల్‌గా ఆలోచించేవారు ఇండియాలో చాలా తక్కువ. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు ఇలాంటివి జరిగిన దాఖలాలే లేవు.
మొదటిసారిగా తెలంగాణలో ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకుని ఇప్పటివరకు ఉన్న మూఢనమ్మకాలను బ్రేక్ చేయనున్నారు. సుప్రియో, అభయ్ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ముందుగా వీరు ఒక డేటింగ్ యాప్‌లో కలిశారు. స్నేహంగా దగ్గరయిన వీరిద్దరు ప్రేమలో పడ్డారు. తాజాగా ఇరు కుటుంబసభ్యులను ఒప్పించి డిసెంబర్‌లో పెళ్లి పీటలెక్కనున్నారు. వీరి పెళ్లి ఇలాంటి ఎన్నో జంటలకు ఆదర్శంగా నిలవనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com