Madhya Pradesh: తల్లి శవాన్ని మంచం మీద మోసుకుంటూ నలుగురు అక్కచెల్లెళ్లు.. అయిదుకిలోమీటర్లు..

Madhya Pradesh: తల్లి శవాన్ని మంచం మీద మోసుకుంటూ నలుగురు అక్కచెల్లెళ్లు.. అయిదుకిలోమీటర్లు..
Madhya Pradesh: తల్లి అస్వస్థతకు గురికావడంతో జిల్లాలోని రాయ్‌పూర్ గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువచ్చారు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది.

Madhya Pradesh: దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని సంతోషపడే సమయంలో కొన్ని సంఘటనలు ఇంకా వెనుకబడే ఉన్నామన్న విషయాన్ని గుర్తు చేస్తుంటాయి.. మరణించిన తల్లి మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు ఆస్పత్రి వాహనం లేక పోవడంతో నలుగురు కూతుళ్లు మంచం మీద మోసుకుంటూ అయిదుకిలోమీటర్లు నడిచి వెళ్లారు.

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో నలుగురు మహిళలు తల్లి మృతదేహాన్ని మంచంపై మోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నలుగురు మహిళలు తమ భుజాలపై తల్లి శవాన్ని మోస్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు.

తల్లి అస్వస్థతకు గురికావడంతో జిల్లాలోని రాయ్‌పూర్ గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువచ్చారు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది.

మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు ఆరోగ్య కేంద్రం వారు శవవాహనాన్ని అందించలేదని మహిళలు ఆరోపించారు. దాంతో మేము మృతదేహాన్ని మంచం మీద మోయాలని నిర్ణయించుకున్నాము. ఆరోగ్య కేంద్రం వారు మాకు సహాయం చేయలేదు" దాంతో తల్లి మృతదేహాన్ని తామే మోసుకుంటూ ఊరికి తీసుకువెళుతున్నామని చెప్పారు.

అయితే, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, డాక్టర్ BL మిశ్రా, ఆరోగ్య కేంద్రం సిబ్బంది శవ వాహనం లేదా ఆటోను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని మంచం మీద ఉంచాలని నిర్ణయించుకుని, హడావిడిగా వెళ్లిపోయారని అంటున్నారు. ఈ ప్రాంతంలో మాకు శవ వాహనం లేదు" అని డాక్టర్ మిశ్రా చెప్పారు.

కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు రోగులను తరలించేందుకు వాహనాలు లేకపోవడంతో గతంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయని జిల్లా యంత్రాంగం అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆస్పత్రికి తగిన సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story