మిణుగురు పురుగును కప్ప మింగితే..

ట్విట్టర్ వింతైన, ఎప్పుడూ చూడని వీడియోలతో నిండి ఉంటుంది. తరచుగా ఆసక్తికర వీడియోలు కొన్ని ఆన్‌లైన్‌లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఒక కప్ప ఒక మిణుగురు పురుగును మింగిన వీడియో ఒకటి హల్చల్ చేస్తోంది. మిణుగురు పురుగును మింగడంతో ఆ కప్ప కడుపులో రంగు రంగుల లైటింగ్ దర్శనమిస్తుంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే కడుపులో ఉన్న ఆ మిణుగురు పురుగు ఇంకా బ్రతికే ఉండటం.. దీన్ని చూసిన నెటిజెన్ల ఆ కప్పకు జీర్ణశక్తి తక్కువ అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరొక ఒక యూజర్ ఇలా అన్నారు.. మనలో ఉన్న వెలుగును ఎవరూ చంపలేరు అని కమెంట్ చేశారు. కాగా 14 సెకన్ల వీడియోను నేచర్ ఈజ్ లిట్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ట్విట్టర్ లో ఈ వీడియో సంచలనంగా మారిపోయింది. 60.8 లక్షల కంటే ఎక్కువ వ్యూస్, 4.3 వేల లైక్‌లను సంపాదించింది.
When a frog eats a firefly pic.twitter.com/31m6ZcurWP
— Nature is Lit🔥 (@NaturelsLit) September 10, 2020
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com