Gaya Temple: ఆ ఆలయంలో దేవుడికి ఏసీ.. ఏకంగా గర్భగుడిలోనే..

Gaya Temple: ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయనే తప్ప తగ్గట్లేదు. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఏసీ, ఫ్యాన్‌లాంటివి లేకుండా ఉండలేకపోతున్నారు. కాసేపు బయట తిరిగినా.. మళ్లీ ఇంటికి వెళ్లి ఏసీ ఆన్ చేసుకునేవరకు ఎండతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే దేవుడిని చూడడానికి వచ్చే వారికి, దేవుడికి కూడా ఏసీ కావాలని ఆ ఆలయంలో ఏసీ అమర్చారట.
బిహార్‌లోని గయాలో ఉన్న ఇస్కాన్ టెంపుల్‌లో ఏసీలు, ఫ్యాన్లు అమర్చారు. అయితే ఎండ వల్ల దేవుడికి ఇబ్బంది కలగకూడదనే ఇలా చేసినట్టు ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షుడు జగదీష్ శ్యామ్ దాస్ తెలిపారు. గర్భగుడిలో రాధాకృష్ణులు, జగన్నాథుడి విగ్రహాల దగ్గర ఏసీలు, ఫ్యాన్లు అమర్చినట్టు చెప్పారు. అయితే దేవుడికి వాతావరణ మార్పులు ఏంటని కొందరు ప్రశ్నించగా దానికి శ్యామ్ దాస్ స్పందించారు.
గయా ఆలయంలో ఫ్యాన్లు, ఏసీలను తాము అమర్చలేదని, అక్కడి భక్తులే అమర్చారని స్పష్టం చేశారు శ్యామ్ దాస్. ఇది వారి నమ్మకంతో కూడుకున్న విషయం అన్నారు. దేవుడు ఏదీ కావాలని కోరుకోడని, కానీ ప్రజల నమ్మకానికి దేవుడు స్పందిస్తాడని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం బిహార్‌లోని ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకంటే ఎక్కువే నమోదవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com