దోమలను చంపేసి.. నోట్‌బుక్‌లో అతికిస్తూ.. కారణం ఇదే!

గత కొన్ని సంవత్సరాలుగా మనదేశం దోమల బెడద సమస్యను ఎదురుకుంటుంది. వాస్తవానికి దోమల వలన ఇబ్బందిపడని మనిషి లేరు కావచ్చు.. అయితే ఈ దోమల నుంచి తప్పించుకునేందుకు చాలా మంది చాలా రకాలైన పద్దతులను పాటిస్తారు. కొందరు జెట్ కాయిన్స్, దోమ తెరలు ఉపయోగిస్తుంటే.. మరికొందరు మాత్రం ఎలక్ట్రిక్ బ్యాట్ లను ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఈ దోమల బెడద మాత్రం పూర్తిగా తప్పడం లేదు.
ఈ దోమలు కుట్టడం వలన ప్రధానంగా మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తాయి. దేశంలో 2019 ఒక ఏడాదిలోనే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు 4లక్షల 87వేల వరకు నమోదయ్యాయి. అలా దోమల బెడద నుంచి చాలా హింసించబడ్డ ఢిల్లీకి చెందినా 19 ఏళ్ల శ్రేయా మోహపాత్రా వాటిని చేతితో చంపడం మొదలు పెట్టింది. అలా ఎన్ని దోమలను చంపిందో తెలుసుకునేందుకు ఒక నోట్ బుక్‌పై నంబర్లు వేసి వాటి స్థానంలో చంపిన దోమలను అతికిస్తోంది.
అయితే శ్రేయా మోహపాత్రా ఇలా దోమలపైన ప్రతీకారం తీర్చుకోవడానికి బలమైన కారణమే ఉందంట.. తన 14వ ఏటా డెంగ్యూ జ్వరం వచ్చిందట.. ఆ సమయంలో ఇంట్లో దోమలు ఎక్కువగా ఉండేవని గుర్తు చేసుకుందట.. ఇక అప్పటినుంచి దోమలను చంపడం మొదలు పెట్టిందట.. అంతేకాకుండా తన 12వ తరగతి పరీక్షల సమయంలో ఇంట్లోకి ఎక్కువగా దోమలు వచ్చేవని, అవి కుట్టడం ద్వారా తాను పరీక్షల్లో ఏకాగ్రత చూపించలేకపోయానని చెప్పుకొచ్చింది.
అయితే తను ఇలా దోమలను చంపి నోట్ బుక్ లో అతికిస్తున్నట్టుగా ఎవరికీ తెలియదని, 2020లో అక్టోబర్ నెలలో ఈ విషయం అందరికి తెలిసిందని చెప్పుకొచ్చింది. 2015లో శ్రేయా ట్విట్టర్ లో చేరింది. ఆ సమయంలో ఆమెకి పెద్దగా ఫాలోవర్లు లేరు. కానీ ఎప్పుడైతే తానూ దోమలను చంపి అతికించిన నోట్ బుక్ ను సోషల్ మీడియాలో పోస్టు చేసిందో అప్పుడు ఆమె బాగా ఫేమస్ అయింది. ఈ ఫొటోకు ఏకంగా 110k లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com